సినీనటులకు ఇప్పుడు వైసీపీలో చేరడం చాలా కామన్ అయ్యింది. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఆ పార్టీలో చేరారు.. ఇప్పుడు ఈ జాబితాలో మరో నటి చేరబోతున్నారు. ఆమె క్యారెక్టర్ నటి హేమ. జగన్ అంటే చాలా ఇష్టం అంటున్న ఈ నటి... త్వరలో రాజకీయాల్లోకీ వస్తానని ఉత్సాహపడుతోంది.


బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అయిన హేమ.. ఆ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టింది.. అదే సమయంలో.. తన రాజకీయ ప్రవేశం గురించి హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరుతున్నారా అని మీడియా ప్రశ్నించగా ఆ విషయం త్వరలోనే ప్రకటిస్తాను అని చెప్పారు. 'నాకు వైసీపీ, సీఎం జగన్‌ అంటే ఇష్టం. ప్రచారం చేయకపోయినా.. పార్టీలో చేరకపోయినా.. ఆయనన్నా.. ఆ పార్టీ అన్నా ఇష్టం.. అంటూ చెప్పుకొచ్చింది.


ఇంకా హేమ ఏమందంటే.... “ మానసికంగా బలంగా తయారు కావాలి. అప్పుడే దేన్నైనా ఎదుర్కోగలను. ఆ తర్వాతే పార్టీలోకి వెళ్తాను. ఒక్కసారి ముందుకు వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి రాకూడదు. నేను సినిమాల్లో నటించడం మానేస్తున్నానని వార్తలొచ్చాయి. నేనెందుకు మానేస్తా. కొన్ని రోజులు షూటింగ్‌ చేస్తా. మరికొన్ని రోజులు నా పనులు చేసుకుంటా. ఇండస్ట్రీలో ఉన్న ఏకైక నిర్మలమ్మను నేనే. ఇంటి బాధ్యతల్ని నా కుమార్తెకు అప్పగించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తా.. అన్నారు హేమ.


ఫస్ట్ వీక్ ఓట్ల ఆధారంగా హేమను బిగ్‌బాస్‌ సీజన్‌-3 హౌస్‌ నుంచి ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తర్వాత తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడారు. హౌస్ లోని మిగిలిన వారిలా తనకు నాటకాలు ఆడటం రాదని నటి హేమ అన్నారు. కొత్త జనరేషన్‌ తనను సరిగా అర్థం చేసుకోలేదని అభిప్రాయపడ్డారు. తనకు మద్దతుగా చాలామంది వ్యక్తిగతంగా ట్వీట్లు, మెసేజ్‌లు చేశారని.. కొందరు మద్దతు తెలిపారని హేమ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: