ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పేరు ఆపార్టీ కార్య కర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. 


అయితే ఇప్పుడు టీడీపీ ఓటమి గురించి మాట్లాడటం కంటే ఆ పార్టీకి ఇప్పుడు భవిష్యత్ నాయకుడెవరన్నది అసలైన ప్రశ్న. సీనియర్ ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు ఆ పార్టీని 30 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ అధికారంలో కొన్నాళ్ళు, ప్రతిపక్షంలో కొన్నాళ్ళు ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు వయసు 70 ఏళ్లకు దగ్గరకు వచ్చింది. మరో పదేళ్లు పోతే చంద్రబాబు ఆ పార్టీని మోసే పరిస్థితిలో ఉండకపోవచ్చు. 


ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీని రక్షించుకోవాలంటే లోకేష్ ఒక మంచి నాయకుడుగా ఎదగాలి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే ఎవరి ప్రతిభ అయినా బయటికి రావాలి. అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు లోకేష్ మంచి గొప్ప లీడర్ లక్షణాలను ప్రదర్శించ లేకపోయాడు. ఇప్పటికి లోకేష్ ను అందరూ తండ్రి చాటు బిడ్డగా చూస్తారు తప్ప. ఒక పార్టీకి అధినేతగా ఎవరు చూడరు. లోకేష్ తన తప్పులను తెలుసుకొని టీడీపీ లీడ్ చేయగలిగే సామర్ధ్యం పెంచుకోగలిగితేనే టీడీపీ మనుగడ సాధ్యం. ఇక బాబు టీడీపీ ఆపార్టీ పగ్గాలను ఎన్టీఆర్ వారసులకు ఇచ్చే రకం కాదని తెలిసిన బహిరంగ సత్యం. అయితే 30 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని లోకేష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రతి పక్ష నేతగా అవతరించిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ పార్టీ ఎదుగుదల లేకపోతే ఖచ్చితంగా ఆస్థానాన్ని పవన్ భర్తీ చేయగలడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: