కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ ఒక రోజు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ శాఖ ప్రకటించింది.  దేశవ్యాప్తంగా ఇవాళ ప్రైవేటు ఆస్పత్రులు బంద్‌ పాటించనున్నాయి. పార్లమెంటులో జాతీయ వైద్యమండలి బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా బంద్‌ తలపెట్టారు. బిల్లును వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం దేశవ్యాప్తంగా 24 గంటల బంద్‌కు పిలుపు నిచ్చింది.


పేదలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రాజ్యాంగ నిర్మాతలు దేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక యాప్ ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఎం ఎన్ సి రద్దు చేసే విధంగా ఈ చట్టం ఉందని అన్నారు.  రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఏ) మనుగడే ప్రశ్నార్థం అయ్యేవిధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.  


అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోయాయి. బంద్‌కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు మద్దతు తెలిపాయి.  బంద్‌కు జూనియర్‌ వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రులు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడనుంది. వైద్య సేవల నిలిపివేతతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. 

బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర చికిత్సలను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైద్యులు శ్రీనివాస్, గౌతమ్, మోహన్ గుప్త, ఎంకే యాదవ్ పాల్గొన్నారు.బంద్‌కు జూనియర్‌ వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రులు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడనుంది. వైద్య సేవల నిలిపివేతతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: