కేసీయార్ బహుముఖ ప్రతిభావంతుడు. ఆయనలో ఉద్యమ కోణం ఉంది. మానవతా భావం ఉంది. రాజకీయం చేయాలంటే కేసీయార్ తరువాతే. అలాగే అభిమానించాలన్నా ఆయన తరువాతే. కేసీయార్ ప్రజల గుండె చప్పుడు గా అందుకే నిలిచారు. రెండవమారు కూడా బంపర్ మెజారిటీతో కేసీయార్ గెలిచారు అంటే అది ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావం. ప్రజలకు ఆయన పట్ల ఉన్న ఆదరణ. ఇక కేసీయార్ రాజకీయ నేత నుంచి రాజనీతికోవిదుడుగా ఎదుగుతున్నారు. ఆయనలో ఉద్యమ కాలం నాటి దూకుడు కంటే రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమన్న భావన ఇపుడు ఎక్కువగా కనిపిస్తోంది.


ఇచ్చి పుచ్చుకునేందుకు కేసీయార్ ఎపుడూ రెడీగా ఉంటారు. అయితే  చంద్రబాబు పాలనలో కేసీయార్ ని సాటి సీఎం గా కంటే ఒకనాటి తన మంత్రివర్గ సహచరుడిగా, శిష్యునిగానే చూశారు. ఈ ఇగోల కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయి. సామరస్యంగా పరిష్కరించుకోవాలసిన అనేక సమస్యలు కూడా అలాగే నిలిచిపోయాయి. ఇపుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ఇక్కడ వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో  ఇద్దరి మధ్యన  మంచి స్నేహ బంధం ఏర్పడింది.


వయసు రిత్యా తేడాలు ఉన్నా మనసు రిత్యా ఇద్దరూ ఒకటిగా కలసిమెలసిఉన్నారు. ఈ నేపధ్యంలో కేసీయార్ ఏపీకి తన వంతుగా ఏదో చేయాలనుకుంటున్నారట. అమరావతి రాజధాని నిర్మాణం పడుతూ లేస్తూ ఉంది. నిధుల కొరతతో అల్లాడుతోంది. కేంద్రం చూస్తే పైసా విదల్చని పరిస్థితి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు తాజా బడ్జెట్ లో జగన్ 500  కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించారు. దానికి చేదోడు వాదోడుగా కేసీయార్ సైతం తమ ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించనున్నారు. సెప్టెంబర్లో  అమరావతి రానున్న కేసీయార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ కీలకమైన ప్రకటన చేస్తారట. 


రెండు తెలుగు రాష్ట్రాలు అభివ్రుధ్ధిలో సమానంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతోనే కేసీయార్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.  సెప్టెంబర్లో గోదావరి జలాల పంపకంపై ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఉంది. దాని కోసం కేసీయార్ ప్రత్యేకంగా అమరావతి వస్తున్నారు. అపుడే అమరావతికి అదిరిపోయే గిఫ్ట్ జగన్ చేతుల మీదుగా ఇస్తారట. ఇదిలా ఉండగా 2015లో అమరావతి శంకుస్థాపన జరిగినపడు కేసీయార్ ముఖ్య అథిధిగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత బాబు తో రాజకీయ విభేదాలు పొడసూపి కేసీయార్ ఈ వైపు చూడడమే మానుకున్నారు. మొత్తానికి ఇపుడు కేసీయార్ ఏపీ అభివ్రుధ్ధి విషయంలో చూపుతున్న చొరవ అభినందనీయమేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: