హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు హిల్స్ కు సమీపంలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లోకి చిరుతలు తరచూ వస్తున్నాయి. తాజాగా కూకట్ పల్లి ప్రగతినగర్ లో చిరుత కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కూకట్ పల్లిలో ప్రగతినగర్ గాజుల రామారం మధ్య చిరుత కనిపించింది. దీంతో సమీపంలోని పలు ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు.మరికొందరు చిరుత తిరుగుతున్న దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. చిరుత రాకపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. చిరుతను తమ ప్రాంతాల్లోకి రాకుండా బోనులు ఏర్పాటు చేయాలని కోరారు


కొద్ది రోజుల కిందట రంగారెడ్డి జిల్లాలో పలు శివారు ప్రాంతాల్లో చిరుతలు హల్ చల్ చేశాయి. ఆవులు, మేకలను చంపేశాయి. దీనిపై అధికారులకు గ్రామస్థులు తెలిపారు. ఈ సారి ఏకంగా ప్రగతినగర్ లోకి రావటంతో బెంబేలెత్తిపోతున్నారు స్థానిక ప్రజలు. చిరుతపులి సంచరిస్తుందన్న వార్త ఇప్పుడు ఇక్కడి ప్రజలని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో  ప్రగతినగర్ మిథిలానగర్ లో ఉన్నటువంటి అపార్టుమెంట్ వెనుక వైపున ఉన్నటువంటి గుట్టల్లో చిరుతపులికి సంబంధించినటువంటి కదలికలో దీనికి సంబంధించి ఇక్కడున్నటువంటి కాలనీ వాసులంతా కూడా తమ ఫోన్ లో షూట్ చేసి వెంటనే ఫారెస్టు అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.



నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో చిరుతపులి దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇక్కడే ఉంటుంది. దాని అరుపులు అవన్నీ విన్న తర్వాత చిరుత అని కన్ఫామ్ చేసుకున్నారు ఇక్కడ స్థానికులు. అయితే వెంటనే ఇదే విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు ఇంకా ఘటనా స్థలానికి రాలేదు అనేది మాత్రం కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై అక్కడి ప్రజలు మాట్లాడుతూ "7 గంటలకి మేము మా విండో నుంచి చుశామండి. చిరుత కనిపించింది మాకు కొండపైన అది చూసిన తర్వాత మేమేదో నార్మల్ అనుకున్నాం కాని , తర్వాత గట్టిగా అరుపులు వినబడ్డాయి రాత్రంతా కాలనీ వాసులకు నిద్రలేదు. మా కాలనీ ఉన్న అందరు అరౌండ్ ఒక 100 మెంబర్స్ అందరూ మేము కలిసి కాలనీలో అంతా నైట్ నిద్రలేకుండా కట్టెలు పట్టుకొని తిరగటం జరిగింది.




కాలనీలో పిల్లలని  బయటకు పంపీయాలనుకుంటే చాలా భయంకరంగా అన్పిస్తుంది మాకు. పక్కనే మా దగ్గర వర్క్ చేసుకోడానికి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళు చిన్న చిన్న టెంట్లేసుకుని ఉంటారు. వాళ్ళకి కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఆ పక్కన చిన్న టెంట్ లోకి వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నైట్ మేం కూడా నిద్రలేకుండా ఈ రోజు మార్నింగ్ నుంచి మేము ఆఫీస్ కి కూడా పోకుండా కాలనీ అసోసియేషన్ కాలనీ గురించి, కాలనీ వాసుల గురించి, వాళ్ల క్షేమం గురించి మేమందరం ఆఫీస్ కి పోకుండా మార్నింగ్ నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి తక్షణమే పులికి సంబంధించిందేదైనా వాళ్ళు తక్షణ చర్యలుతీసుకుంటే మేము దానికి ఆనందిస్తాం"అని అక్కడి ప్రజలు అన్నారు. ఈ గుట్ట పక్కనే ఒక అపార్ట్ మెంట్ కనస్ట్రక్షన్ జరుగుతుంది. కింద వాచ్ మెన్ ఉన్నారు. ఆ వాచ్ మెన్ కూడా నిన్న ఈ శబ్ధం విన్నట్లు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: