రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  (ఆర్ఎస్ఎస్) "నేషనల్ వాలంటీర్ ఆర్గనైజేషన్" లేదా "నేషనల్ పేట్రియాటిక్ ఆర్గనైజేషన్" . ఆర్.ఎస్.ఎస్ ఒక భారతీయ మితవాద , హిందూ జాతీయవాది , పారామిలిటరీ వాలంటీర్ సంస్థ . ఆర్‌ఎస్‌ఎస్‌ ను బిజెపి మాతృ సంస్థగా కూడా పరిగణిస్తారు . ఇప్పటి వరకు దేశానికి నేతలను అందించిన ఆర్ఎస్ఎస్ ఇపుడు జవాన్ లను  అందించేదుకు సిద్ధమవుతుంది . ఆర్ముడ్ ఫోర్సెస్ కోసం విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వనున్నారు . దీని కోసం ఆర్మీ తరహా స్కూల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు .


ఎడ్యుకేషన్ వింగ్ అయిన విద్యా భారతి దీన్ని నిర్వహించనుంది . ఈ స్కూల్ కు ఆర్ఎస్ఎస్ మాజీ సరసంఘచాలక్ రాజేంద్ర సింగ్ అలియాస్ రాజు భయ్యా పేరుపెట్టనున్నారు .యూపీలోని బులంద్ షహర్ జిల్లా షికార్ పూర్ లో రాజు భయ్యా సైనిక్ విద్యా మందిర్ పేరుతో ఈ స్కూల్ ని ఏర్పాటు చేయనున్నారు . గత ఆగస్టులో 20,000 చదరపు మీటర్ల స్థలంలో స్కూల్ నిర్మాణం ప్రారంభమైంది . దీని కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు .


ఈ స్థలాన్ని మాజీ సోల్జర్ రైతు రాజ్ పాల్ సింగ్ డొనేట్ చేశారు.ఆర్ఎస్ఎస్ హయాంలో కొనసాగనున్న ఆర్మీ స్కూల్ లో సిబియస్ ఇ సిలబస్ ను అమలు చేయనున్నారు . 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ క్లాస్ లు నిర్వహిస్తారు . వచ్చే ఏప్రిల్ నుంచి స్కూల్ ప్రారంభమౌతుంది . తొలిభాషలో 160 మంది విద్యార్థులకి అడ్మిషన్ లు ఇవ్వనున్నారు . ఇందులో రిజర్వేషన్ స్కీమ్ కింద అమరవీరుల కుటుంబాల పిల్లలకు 56 సీట్లు రిజర్వు చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: