సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో నలుగురు సిబ్బంది ఉద్యోగ విరమణ చేశారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన సిబ్బందిని సైబరాబాద్ పోలీస్ కమీషనర్  వీసీ సజ్జనార్,ఐపీఎస్., పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. పింఛన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘకాంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న సిబ్బందిని శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీవిరమణ చేసిన వారికి ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చన్నారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.   


అనంతరం ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సినీ నటుడు అలీ మాట్లాడుతూ.. పోలీసులకు రిటైర్ మెంట్ అనేది ఉద్యోగానికి ఉంటుంది కానీ వారి గుండెల నిండా ధైర్యం,తెగువ, అంకితభావం మాత్రం అలానే ఉంటుందన్నారు.అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ సమాజాన్ని రక్షించడంలో కనిపించని నాలుగో సింహమే పోలీస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 30 ఇయర్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అయితే తాను 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని నవ్వులు పూయించారు. 


అనంతరం స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన సినీ దర్శకుడు ముప్పలనేని శివ (రాజా, సంక్రాంతి మూవీస్ ఫేమ్) మాట్లాడుతూ.. పోలీసు రిటైర్మెంట్ కేవలం వృత్తికే కానీ వ్యక్తిత్వానికి, మనసుకు కాదన్నారు. పదవీ విరమణ చేసిన వారు సైతం పోలీస్ డెపార్ట్ మెంట్ కు అనుబంధంగా పని చేయవచ్చన్నారు. ప్రస్తుతం తాను 60వ వసంతంలో అడుగిడినాని.. జీవితంలో మంచి సినిమాలు, గొప్ప నటులతో పనిచేసిన సంతోషం తృప్తి ఉందన్నారు.

తాను కుటుంబ అనుబంధాల చిత్రాలు రాజా, వసంతం వంటి ఫీల్ గుడ్ మూవీస్ తీశానని.. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో మళ్ళీ అలాంటి అనుభూతి చెందుతున్నానన్నారు. తనను ఆహ్వానించిన సీపీ గారికి ధన్యవాదలని తెలిపారు. పదవీ విరమణ చేసిన వారిలో..ఏసీపీ సీహెచ్ విద్యాసాగర్ సీఏఆర్ (హెడ్ క్వార్టర్స్), ఎస్ఐ ఏ. లక్ష్మి నారాయణ (గచ్చిబౌలి పీఎస్), బి. మల్లా రెడ్డి (సిసిఎస్ బాలానగర్), ఏఎస్ఐ జి లక్ష్మయ్య (ఎస్బీ) ఉన్నారు.


ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డిసిపి అనసూయ (అడ్మిన్, షీ టీమ్స్), క్రైమ్స్ ఏడీసీపీ ఇందిర, సీఏఆర్ (హెడ్ క్వార్టర్స్) మాణిక్ రాజ్, ఏడీసీపీ గౌస్ మొహియుద్దీన్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, సీఏఓ (అడ్మిన్) శ్రీనివాస మూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్,   ప్రత్యేక అతిథులు సినీ నటుడు అలీ,విచ్చేసిన సినీ దర్శకుడు ముప్పలనేని శివ,సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: