భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎల్లందు ప్రాంతం, గుండాల మండల ఏజెన్సీ లో ఆదివాసీ ప్రజల హక్కుల, పొడుభూముల పరిరక్షణకై పోరాడే సి పి ఐ ఎం ఎల్ న్యూ డేమోక్రేసీ పార్టీ నేత లింగన్నను బుధవారం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పరిసర గిరిజన గ్రామాల ప్రజల సహజప్రతీకార స్పంధన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. లింగన్నను ఎన్‌కౌంటర్‌ చేసిన వెంటనే ఆ ప్రాంత గిరిజనులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని రాళ్ల వర్షం కురిపిస్తూ అక్కడ నుంచి వెల్లగొట్టారు.


ఇటీవల ఛత్తీష్‌ఘడ్‌ - ఆంధ్రా సరిహద్దులో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్‌లు మరణించారు. ఈ నేపధ్యంలో మావోయిస్టులు తమపై దాడులకు పాల్పడవచ్చని భావించిన పోలీసులు అడవుల్లో  కూంబింగ్‌ చేపట్టారు. అదే సమయంలో భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. 
ఈ విషయమై ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు వెంకటేశ్వర్లు అనేక విషయాలను వెల్లడించారు. ఆ రాతలు ఆయన మాటల్లోనే.


బూటకపు ఎదురు కాల్పులకు ఒడిగిట్టిన సాయుధ పోలీసు దళాలపై నిర్భయంగా ప్రజల ప్రతిఘటనా దృశ్యం! పోలీసుల్ని తరిమేసి, వారి చేతుల్లోని మృతుడు లింగన్న మృత దేహాన్ని చేరిన దృశ్యమిది. తమ ప్రియ తమ నేత భౌతిక కాయం చుట్టూ మూగి ఆదివాసీ ప్రజలు భోరున ఏడుస్తున్న దృశ్యం! నిజానికి ఇంతకంటే ప్రజా ప్రతిఘటన అనేకరెట్లు ఎక్కువ స్థాయిలోనే ఈరోజు అక్కడ అడవిలో సాగింది. ఐతే మైదాన ప్రాంతాల నాగరికుల వద్ద ఉన్నట్లు ఏజెన్సీ ఆదివాసీ ప్రజలకు స్మార్ట్ ఫోన్లు పెద్దగా ఉండవు. ఉన్న కొద్దీ మంది యువకులకు కూడా నాగరికుల వలె వెంటనే వీడియో చిత్రీకరించే ఐడియా రాదు. 


అందువల్ల లోకం దృష్టికి ప్రజాప్రతిఘటనా దృశ్యాలు పూర్తిస్తాయిలో వెలుగు చూడలేక పోవడం గమనార్హం. ఐనా ఒకరిద్దరు ఆదివాసీ యువకులకు ఆఖరి క్షణాలలో తట్టిన ఆలోచనతో చిత్రించిన చిన్న వీడియో క్లిప్పింగ్ ఇది! దీన్ని చూసే సావకాశం నాగరిక సమాజానికి దక్కింది. 1-నేడు అడవి బిడ్డలపై రాజ్య క్రూర దాడిస్వభావం 2-ఆదివాసీ ప్రజల తరపున పోరాడే విప్లవ పోరాట శక్తుల పట్ల ప్రజల ప్రేమ అభిమానాల స్వరూప స్వభావాలు 3-తమ జీవించే హక్కు కోసం, పొడుభూముల పరిరక్షణకై ఆదివాసీ ప్రజల్లో పెరుగుతున్న ప్రతిఘటన చైతన్యం 4-ఆదివాసీ ప్రజలపై కుహనా నాగరిక, ప్రజాతంత్ర రాజ్యాల దుష్ట రాజకీయ విధానాల స్వభావలను నాగరిక, విద్యాధిక ప్రజలు అర్ధం చేసుకునేందుకు ఈ అతి చిన్న వీడియో క్లిప్పింగ్ సహకరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: