ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో రోజుకో మార్పు .. ! పాలకపక్షాన్ని విమర్శిస్తూనే ఆ పార్టీలోకి చేరేందుకు అడుగులు వేస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. మొన్నటికి మొన్న కేశినేని నాని 2024 మా టార్గెట్ అంటూ ట్విట్ చేస్తే అంతవరుకు తెలుగు దేశం పార్టీ ఉంటుందా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు. 


ఈ మాటలకి కారణం ఒక రకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల ప్రవర్తనే కారణం అని చెప్పచు. మొన్నటికి మొన్న కేశినేని నాని, బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేధికగా ట్విట్ల యుద్దాలు చేసుకొని ఒకరు తప్పులు ఒకరు బయట పెట్టుకున్నారు. మరో పక్క నారా లోకేష్ రెక్కలు ఉడేలా ట్విట్టర్ లో ముఖ్యమంత్రి జగన్ పై, వైసీపీ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. 


చంద్రబాబు ఏమో అసంబ్లీలో మాటలు పడుతూ, ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మిత్రుడు అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అయన ఆరోగ్య చికిత్స కోసం  విదేశాలకు వెళ్లారు. ఇంతలో అయనకు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు బోండా ఉమా. 2019 ఎన్నికల్లో బోండా ఉమ కేవలం 35 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ మారుతారని వైసీపీలోకి చేరుతారని వార్తలు వచ్చాయి. 


అయితే బోండా ఉమా అనుచరులు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఆగిపోయిన బోండా ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారట. దీనికి తగ్గట్టు వైసీపీ కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జిగా బోండా ఉమను ఉండమని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బోండా ఉమ పార్టీ మారనున్నారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఒకవేళ బోండా ఉమా పార్టీ మారుతే చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ తగులుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: