అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏకంగా ఒకేసారి లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా పల్లె తలరాత మార్చాలని భావిస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన నవరత్నాల అమలకు సీఎం జగన్ చర్యలు చేపట్టారు.


సచివాలయాల ఏర్పాటు ఇందులో భాగమే. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ సచివాలయాల్లో 95వేల 88 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ వార్డు సచివాలయాల్లో 31వేల 640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.


రాష్ట్రవ్యాప్తంగా 13వేల 068 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఉద్యోగాలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.


ఒకే నోటిఫికేషన్లో అనేక పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ విద్యార్హతలను సరిగ్గా చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలాగే.. ఈ ఉద్యోగాల కోసం ఏపీ సర్కారు ఓ ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. http://vsws.ap.gov.in/ ఇందులో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ చెక్ చేసుకుంటే మంచిది.


గ్రామసచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సీఎం జగన్ బెస్ట్ విషెష్ చెప్పారు. జగన్ తన ట్వీట్ లో ఏం చెప్పారంటే...

“ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అనూహ్య స్పందన వస్తోంది. నిన్న ఒక్కరోజే 1.34లక్షల మందికిపైగా, మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ ఆల్‌ ద బెస్ట్.”


మరింత సమాచారం తెలుసుకోండి: