ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి పై భారీ స్థాయిలో కుట్రకు ప్లాన్ చేసారని అంటున్నాయి వైసిపి శ్రేణులు. వాస్తవానికి జగన్ గారు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించి కేవలం రెండు నెలలు మాత్రమే గడిచిందని, అయితే ఈ రెండు నెలల్లో ఆయన ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అలానే, తమ మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలు వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారని అంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు అలానే యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలపైన కూడా జగన్ మరింతగా దృష్టి సారించడం జరిగిందట. 

యువత మన రాష్ట్రం దాటి ప్రక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారని, ఆ పరిస్థితిని తమ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో చాలావరకు తగ్గించాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారట. అంతేకాక మరోవైపు కేంద్రం ద్వారా రాష్ట్రానికి రావలసిన నిధులు, అలానే రాష్ట్రానికి ప్రాణప్రదమైన పోలవరం పై కూడా గట్టిగా దృష్టి సారించి, వీలైనంత త్వరగా ఆ ప్రాజక్ట్ ని ప్రారంభించేలా ఇప్పటికే జగన్ చర్యలు చేపట్టారని చెప్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ఎన్నో కుటుంబాలు మద్యం వలన నాశనం అవుతున్నాయని భావించి, తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో మధ్య నిషేధం అంశాన్ని చేర్చడం జరిగిందని, అయితే అది అమలు చేయడం అంత సులువు కాదని మా అందరికి కూడా తెలుసు, కాకపోతే ఏ అంశం అయినా విడతల వారీగా అమలు చేయడం జరుగుతుంది. ఇక జగన్ గారి ఆలోచనల ప్రకారం, రాష్ట్రంలో రాబోయే నాలుగున్నరేళ్ల తమ పాలన ముగిసేలోగా మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసేలా సాధ్యమయినంతవరకు ప్రయత్నం చేస్తున్నారట. 

అలానే రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి విషయంలో కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగేలా యోచిస్తున్నారట. మరి ఇన్నివిధాలుగా జగన్ గారు ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం ఎంతో శ్రమపడుతూ అవినీతి రహిత పాలనను అందిస్తూ ముందుకు సాగుతుంటే, తమ నాయకుడిపై కుట్రతో లేనిపోని విధంగా చంద్రబాబు సహా  టిడిపి పార్టీ నాయకులందరూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాయి వైసీపి శ్రేణులు. ఇప్పటికే టిడిపి పని రాష్ట్రంలో అయిపోయిందని, అది తెలిసే అందులోని చాలా మంది నాయకులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తమ నాయకుడిపై ఎన్ని కుట్రలు చేసినా వాటిని దేవుడే భగ్నం చేస్తాడని, ప్రజల మెప్పు అలానే దేవుడి ఆశీర్వాదం తనమే ఉన్నాయని వారు నొక్కి వక్కాణిస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: