పాకిస్థాన్ లో పురాతన హిందూ దేవాలయం తెరుచుకుంటోంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత సియాల్ కోట్ జగన్నాథ మందిరాన్ని పునరుద్ధరించబోతున్నారు. బాబ్రీ ఘటన తర్వాత దీన్ని పాక్షికంగా ధ్వంసం చేసారు. 1947 నాటికి ఈ ఆలయం ఓ వెలుగు వెలుగుతూ వుండేది. పాకిస్తాన్ లో దశాబ్దాల తరువాత తెరచుకున్న ఆలయం వెయ్యేళ్ళ ఘన చరిత్ర గల హిందూ దేవాలయం. సియాల్ కోర్ట్ శావాల స్రావాల తేజాసింగ్ ఆలయం. దేశ విభజన సమయంలో 72 ఏళ్ళ క్రితం మూత పడిన ఆలయం. పాకిస్థాన్ సియాల్ కోర్ట్ లో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన జగన్నాథ ఆలయాన్ని మళ్లీ తెరుస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 ఏళ్ళ క్రితం మూసివేసిన ఈ పురాతన ఆలయాన్ని మళ్లీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకొచ్చింది.


సర్కార్ తేజాసింగ్ నిర్మించిన సావాల తేజాసింగ్ ఆలయం భారత్ పాక్ విభజన సమయంలో మూతపడింది. సావాల తేజాసింగ్ ఆలయం లాహోర్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు వెయ్యేళ్ల కిందట సర్ధార్ తేజసింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ 1992 లో ఓ గుంపు ఈ ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసింది. దీంతో హిందువులు ఇక్కడికి రావడం మానేశారు. తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. జగన్నాధ ఆలయాలు భారత్ లో 12 ఉంటే బంగ్లాదేశ్ లో 2 పాకిస్థాన్ లో ఒకటి ఉన్నాయి.




సియాల్ కోట్ నగరం పారిస్ రోడ్ లో ఈ మందిరం ఉంది. స్వాతంత్ర్యానికి ముందు ఆలయ రథయాత్ర కూడా ఇక్కడ జరిగేది. నిజానికి పాకిస్తాన్ లో కొన్ని వందల హిందూ ఆలయాలు ఉన్నాయి. సియాల్ కోట్ జగన్నాథ ఆలయం, బెలూచిస్థాన్ లో హింగ్లాజ్ మాతా మందిర్, కరాచిలోని పంచముఖి హనుమాన్ టెంపుల్, ముల్తాన్ సూర్యదేవాలయం, కరాచిలోని వరుణి ఆలయం, చక్వాల్ లోని కటశ్రాజ్ టెంపుల్, కళ్కాదేవి కేఫ్, పెషావర్ గోరఖ్ నాథ్ టెంపుల్ ఆలయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్య్రానికి ముందు ఈ ఆలయాలు ఓ వెలుగు వెలిగాయి. వైభవోపేతంగా అన్ని రకాల కైంకర్యాలు అందుకునేవి. భక్తుల తాకిడి కూడా ఎక్కువ గానే ఉండేది.1947 లో రెండు దేశాలూ విడిపోయిన తర్వాత పాక్ ముస్లిం దేశంగా ఏర్పడింది. దీంతో అక్కడి హిందూ దేవాలయాలు ఎన్నో మూతపడ్డాయి. చాలా చోట్ల హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ధ్వంసం చేసి ఆలయ సంపదను కూడా అడ్డంగా దోచుకున్నారు. పాకిస్థాన్ లో హిందూ జనాభా 1901 లో 40 శాతం ఉండేది. ఇప్పుడది ఒకటి రెండు శాతానికి మించదు. 1992 బాబ్రీ మసీద్ ఘటన తర్వాత పాకిస్థాన్ లో కొన్ని వందల దేవాలయాల ధ్వంసం జరిగింది.ఇప్పుడు అక్కడ వందలాది దేవాలయాలూ ధీనావస్థలో ఉన్నాయి. కనీసం రోజువారి పూజాకార్యక్రమాలు కూడా నోచుకోని గుళ్ళు ఎన్నో ఉన్నాయి. చారిత్రక పౌరాణిక ప్రాధాన్యత కలిగిన మందిరాలు, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.


వాటిలో సావాల తేజాసింగ్ దేవాలయం కూడా ఉంది. బలవంతంగా మతమార్పిడి చేయించడం ఇస్లాం సంప్రదాయం కాదన్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ జాతీయ మైనార్టీ దినోత్సవం సందర్భంగా మైనార్టీల మతస్వేచ్ఛనూ సాంప్రదాయాలను గౌరవించాలని ప్రజలకు సూచించారు.ఈ క్రమంలో తాజాగా స్థానిక హిందువుల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఈ ఆలయాన్ని తిరిగి తెరిచినట్టు పాక్ అధికారులు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆలయంలో దెబ్బ తిన్న భాగాలను కూడా పునరుద్దరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని పరిరక్షించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి హిందూ దేవాలయాలు భవిష్యత్తులో మరిన్ని తిరిగి తెరుచుకుంటాయని భావిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: