తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని 'వైసీపీ' నాయకులూ చేసే ప్రతి తప్పును ట్విట్టర్ వేధికగా విమర్శలు చేస్తున్నారు. ఒకొక్కసారి సొంత పార్టీ నాయకులపై కూడా విమర్శలు చేసి అధిష్టానానికి తల నొప్పి తెస్తుంటారు. అలానే కొన్ని వారాల క్రితం బుద్ధా వంకన్నాతో ట్విట్ల యుద్ధం చేశాడు కేశినేని నాని. ఆ ట్విట్ యుద్ధం చేసుకున్నప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ వారి తప్పులన్నింటిని నెట్టింట్లో తీసుకొచ్చి పెట్టారు కేశినేని నాని, బుద్దా వెంకన్న. 


మరుసటి రోజు అధిష్టానం మీ గొడవలు ఆపండి అంటూ హెచ్చరించినప్పుడు బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేధికగా 'ఈ ట్విట్ల యుద్ధం ఆపేస్తున్నా అంటూ ట్విట్ చేస్తే.. నేను ఆపేదే లేదు, కావాలంటే రాజీనామా చేస్తా అంటూ ఘాటుగా ట్విట్ చేశారు కేశినేని నాని. ఈ ట్విట్ తో పాలకపక్షం నేతల సైతం కేశినేని నాని కూడా సుజనా చౌదరీల పార్టీ మారుతారు, టీడీపీకి గుడ్ బై చెప్తారు అని అందరూ భావించారు. 


కానీ కేశినేని నాని విచిత్రంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోని ట్విట్ చేస్తూ 'మా తెలుగు దేశం పార్టీకి మేము ముగ్గురం చాలంటూ' ట్విట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వన్నీ విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నేడు కూడా ట్విట్ చేస్తూ రైతులను ఆదుకోవాలని ట్విట్ చేశారు. కేశినేని నాని ట్విట్ చేస్తూ 'జగన్ గారూ నందిగామ లో న్యాయ పోరాటం చేస్తున్న రైతులను మీ పోలీసులు కొట్టి దొంగ కేసులు నమోదు చేయటానికి పోలీస్ స్టేషన్ కు లాక్కు వెళ్తున్నారని సమాచారం వెంటనే స్పందించి రైతులను రక్షించండి వాళ్ళు అన్నదాతలు నేరస్థులు కాదు.' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కి నెటిజన్ల నుంచి ఘాటుగా స్పందన వస్తుంది. మరి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ట్విట్ కి ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: