పోసాని మురళి క్రిష్ణ ఈ పేరు తెలియని సినీ అభిమానులు, రాజకీయ పట్ల అవగాహన ఉన్నవారు ఉండరని చెప్పాలి. అయితే ఎన్నికల ముందు పోసాని జగన్ పార్టీకి సపోర్ట్ చేసిన సంగతీ తెలిసిందే. ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ టీడీపీని ఉతికారేశాడు. పోసాని మంచి వక్త అని అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ఎన్నికల ముందు చంద్రబాబు మీద లోకేష్ మీద పోసాని విరుచుకుపడినట్టు ఏ సినీ నటుడు మాట్లాడలేదని చెప్పాలి. 


ఎప్పటికప్పుడు టీడీపీ నుంచి జగన్ కు ఎవరైనా కౌంటర్ ఇస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా వదిలిపెట్టకుండా అందరినీ తనదైన రీతిలో విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ పార్టీ మీద జగన్ మీద ఈగ వాలకుండా అవతలి పార్టీ వారికీ కౌంటర్ లు ఇచ్చారు. అయితే ఎన్నికలు జరిగిన తరువాత పోసాని మొదటి సరిగా మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని. ఆపరేషన్ విజయవంతగా జరిగిందని చెప్పడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టానని చెప్పుకొచ్చారు. 


మీడియాతో మాట్లాడుతూ, శివాజీ గురించి మాట్లాడే స్థాయి నాది కాదని అయన చాలా పెద్ద హీరోనని శివాజీను ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల నుంచి శివాజీ కనిపించకుండా మొన్నా మధ్య తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సంగతీ తెలిసిందే. అయితే పోసాని ఇంకా మాట్లాడుతూ శివాజీ గురించి నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదని ఇప్పుడు కూడా మాట్లాడానని చెప్పారు. ఇంకా చెబుతూ జగన్ పాలన లోకేష్ కు నచ్చాల్సిన అవసరం లేదని, లోకేష్ కు జగన్ ఎప్పటికి నచ్చదని తనదైన రీతిలో చెప్పారు. జగన్ పాలన నచ్చాల్సింది ప్రజలకు గాని లోకేషుకో టీడీపీకి కాదని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: