ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. జెరుసలేం ప్రయాణానికి ముందు కేసీఆర్ ను కలిశారు వైయస్ జగన్. ఈ భేటీలో ఉమ్మడి మంచి నీటి ప్రాజెక్టులు విభజన సమస్యల పై చర్చించారు. అలాగే ఏపీ భవన్ విభజన సొంత రాష్ట్రానికి ఉద్యోగుల బదిలీలపై చర్చ జరిగింది. అంతకుముందు రాజభవన్ లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు వైఎస్ జగన్.


కొద్ది సేపటి క్రితమే తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  భేటీ అయ్యారు. అంతకుముందు జగన్మోన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా కలిశారు.  అటు గవర్నర్ తో భేటీలో కూడా ప్రధానంగా విభజన అంశాల పై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఆయన జెరూసలెం వెళ్తున్న నేపథ్యంలో మర్యాద పూర్వకంగానే అటు గవర్నర్ ఇటు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా గతంలో ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ పైన కూడా  ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్య మంత్రి కేసీఆర్ తో కూడా జగన్ ఇదే విషయాలపైన  మాట్లాడుతున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం. జూన్ 28వ తేదీ న ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు.



ఆ ఇద్దరు సీఎంల సమావేశంలో రాష్ట్ర విభజన సమస్యలతో పాటు గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా  చర్చించడం జరిగింది. గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధించాలనేటువంటి ఆప్షన్ పైన ప్రధానంగా ఆ రోజు చర్చ జరిగిన తర్వాత మళ్లీ భేటీ కాలేదు. మరొకవైపు విభజనకు సంభందించినటువంటి ఇష్యూస్ మాత్రం కూడా ఇరు రాష్ట్రాల సంబంధితులు అధికారులు కూడా సమావేశం అయ్యారు. ఆ ఇద్దరూ రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చిన్నపాటి చర్చల యొక్క అభ్యర్థి కావచ్చు , వీటికి సంభందించిన  అంశాలపైనా ఈ రోజు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులూ మాట్లాడగా.


దీంతో పాటు మొన్నటి వరకు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఈ విభజన వంటి అంశాలపైనా అక్కడ  ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీయడం కానీ చంద్రబాబునాయుడు కొన్ని కామెంట్స్ పై రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి  ఇష్యూస్ పైన  జగన్ వివరిస్తున్న తీరుపైన కూడా అక్కడ ఆయన కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ప్రధానంగా తీసుకున్నట్లు ఐతే వర్షం పడుతున్నటువంటి  నేపథ్యం ఏ విధంగా ఐతే  గోదావరి జలాలు కిందికీ వెళ్లిపోతున్నట్టు వంటి పరిస్థితుల్లో వాటిని ఎందాకా భవిష్యత్తులో  ఉపయోగించుకోవగలం అనే విషయం పై  ఇద్దరు ముఖ్య మంత్రులు వాటర్ రిసోర్సస్ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని పాటుపడుతున్నారు.


మరొకవైపు ఆగస్టు 8న కూడా రెండు రాష్ట్రాల  అధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం కాబోతున్నారు. ఈ 8  అంశాల పై ఎజెండా లో  విద్యుత్తు బకాయిలు కావచ్చు,  విభజన అంశాలు కావచ్చు వీటన్నిటి పైన కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశం లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదే విషయాన్ని 8 దవ తేదీన ఢిల్లీ లో జరిగే భేటీ లో అధికారులు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి నెల రోజుల తర్వాత ఇద్దరు సీఎంలు భేటీ అయ్యి దేశాభివ్రృద్దిపై చర్చలు జరిపినట్టు సమాచారం






మరింత సమాచారం తెలుసుకోండి: