ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఉన్నవ్ రేప్ ఘటనకు సంబంధించి 5 కేసులను లక్నో నుంచి ఢిల్లీ కోర్ట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఫాస్ట్ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసి 45 రోజులలో విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఢిల్లీ కోర్టులోనే ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వారం రోజుల్లో బాధితురాలి యాక్సిడెంట్ కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.


సిబిఐ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటికే ఈ కేసు పూర్వాపరాలను సుప్రీం కోర్టు ముందుంచారు సిబిఐ జెడి సంపత్. బాధితురాలి కుటుంబానికి 24 గంటల్లో 25,00,000 పరిహారాన్ని అందించాలని సుప్రీంకోర్ట్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఢిల్లీకి మెరుగైన చికిత్స కోసం తరలించే అవకాశాలను పరిశీలించాలని కోరింది. బాధితురాలి కుటుంబ సభ్యులను అడిగి ఆమెను ఢిల్లీకి తరలించే విషయాన్ని పరిశీలించాలని కోరింది సుప్రీం కోర్ట్. ఉన్నావ్ యాక్సిడెంట్ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ సస్పెండయ్యాడు. బిజెపి నుంచి కుల్దీప్ సింగ్ ను బహిష్కరిస్తూ తాజాగ నిర్ణయం తీసుకున్నారు.



ఉన్నావ్ రోడ్డు ప్రమాదం కాదని హత్యాయత్నం అని ఆరోపిస్తున్నారు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.  ఉన్నావ్ దుర్ఘటనలో గాయపడ్డ బాధితురాలు ఆమె లాయర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కెంజి డాక్టర్ లు తెలిపారు. అయితే వారు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లుగా ప్రకటించారు. వారు కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ రోజు ఈ కేసు విచారణ విషయంలో నేరుగా జోక్యం చేసుకుని సిబిఐని అనేక ప్రశ్నలు కురిపించింది. అంతే కాకుండా నేర విచారణ సమయంలో ఆ కోర్టులో దాఖలు చెప్పే చార్జి షీట్స్ అంటే సిబిఐ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన విషయం తెలిసిందే.




అందులో మూడు ఎఫ్ఐఆర్ లు ఫైలయ్యాయి. రీసెంట్ గా జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లు ఇంకా చార్జి షీట్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆ చార్జి షీట్ ని సైతం వారం పది రోజుల్లోగా విచారణ పూర్తి చేసి చార్జి షీట్స్ ని ఫైల్ చేయాల్సిందిగా సుప్రింకోర్ట్ ఆదేశించింది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జి షీట్స్ కి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో విచారణ జరిపేలాగా ఆ షీట్లను ఢిల్లీలో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని ఇక్కడే వాటిని చార్జి షీట్ల మీద వేగవంతంగా విచారణ జరపాలని చెప్పి ఆదేసించింది. తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించే ప్రయత్నం జరుగుతున్నది అని చెప్పేసి సుప్రీంకోర్ట్ తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: