స్టీఫెన్ రవీంద్ర, శ్రీ లక్ష్మీ ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ పై ఏపీకి వెళ్లడానికి లైన్ క్లియరైంది. దాదాపు రెండు నెలల క్రితం స్టీఫెన్ ని అడిగారు జగన్. ఆ తర్వాత శ్రీలక్ష్మిని అడిగారు. తెలంగాణా ప్రభుత్వం ఓకే చెప్పేసింది కానీ, కేంద్రం నుంచి మాత్రం ఇన్నాళ్లు గ్రీన్ సిగ్నల్ రాలేదు. అసలు ఇన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ వారిని ఎందుకు ఆపింది.? ఇప్పుడు ఓకే చెప్పడం వెనక చక్రం తిప్పిందెవరు.? స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి ఒకరు ఐపీయస్ మరొకరు ఐఎఎస్. ఉమ్మడి ఏపీ విభజనలో ఇద్దరు తెలంగాణ క్యాడర్ ను ఎన్నుకున్నారు.


ఇప్పుడు వీరిద్దర్నీ ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓకె చెప్పేసింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరకు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి సీన్ లోకి ఎంట్రీ అయితే కానీ విషయం ముందుకు కదలలేదు. ఏపీ సీఎం జగన్ అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కి స్టీఫెన్ రవీంద్రను సెలెక్ట్ చేశారు. ఆయన్ను ఏపీకి పిలిపించారు, చర్చించారు.


ఏపీకి వెళ్లడానికి స్టీఫెన్ కూడా ఓకే చెప్పడం అటు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. కానీ స్టీఫెన్ రవీంద్రను ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ పై పంపడానికి కేంద్ర హోంశాఖా వెంటనే ఒప్పుకోలేదు. ఆపై ఐఏఎస్ శ్రీ లక్ష్మి విషయంలోనూ అదే జరిగింది. దీంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారట. శ్రీలక్ష్మిని తీసుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారట. స్టీఫెన్ విషయంలో కానీ శ్రీలక్ష్మి విషయంలో కానీ ఉన్న సందేహాలను తీర్చే ప్రయత్నం చేశారట. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయం లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటానికి కారణం, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ ఒప్పుకోకపోవడమే అట. సాంకేతిక కారణాలు చూపుతూ వారి ఫైళ్లకు క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారట.


అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారికున్న అభ్యంతరాలపై క్లారిటీ ఇచ్చి, అలానే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కూడా కలవడంతో విషయం కొలిక్కొచ్చింది. రెండు మూడు రోజుల్లోనే స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ రిపిటీషన్ లేఖ కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రానుందట. అలానే శ్రీలక్ష్మి విషయంలోనూ త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయట. నిజానికి ఇరు రాష్ర్టాలూ అంగీకరించినప్పుడు కేంద్ర హోంశాఖ నుంచి జరిగే ప్రక్రియ జస్ట్ ఫార్మల్టీ అన్న కోణంలోనే సాగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలో మాత్రం చాలా కాలం వెయిట్ చేయడం మాత్రమే కాదు విజయసాయిరెడ్డి జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలను వాడాల్సి వచ్చిందట. వీరిద్దరి ఫైళ్లను కేంద్ర హోంశాఖ ఇన్నాళ్లూ ఎందుకు క్లియర్ చేయలేదు అన్నది చర్చ నీయాంశంగా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: