విజయనగరం ఏజెన్సీ గజగజలాడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తోంది. పుట్టిన ఊరికి ఎక్కడ పరాయివాళ్లుగా మారిపోతామని అనే భయంతో బిక్కుబిక్కుమంటుంది. మన్యం తల్లడిల్లుతుంది. తమ ఊరికి తమను పరాయివాళ్లను చేయవద్దంటూ వేడుకుంటోంది. మావోయిస్టుల సంచారం గ్రేహౌండ్స్ బలగాల వేట ఇన్నాళ్లూ విజయనగరం జిల్లా ఏజెన్సీ ఎదలపై కవాతు చేసిన భయం ఇదే. కానీ కొన్నాళ్ల నుంచి మరో భయం వేధిస్తోంది, గజరాజుల సంరక్షణ కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ ఆలోచన ఇప్పుడు విజయనగరం జిల్లా ఏజెన్సీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

విజయనగరం జిల్లాకు అత్యంత సమీపాన ఉండే ఒడిస్సాలో మైనింగ్ యదేచ్ఛగా సాగుతోంది. ఒడిస్సాలో అడవులు నాశనం అయ్యాయి. దీంతో సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోకి భారీగా ఏనుగుల గుంపు తరలివచ్చింది. ఆహార వేట మాత్రమే కాదు ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ఏనుగుల గుంపు విజయనగరం జిల్లాకు వలస వచ్చింది. అప్పటి నుంచి అంటే దాదాపు అయిదేళ్ల నుంచి గుణపూర్, సీతంపేట, కురుపాం, జియ్యమ్మ వలస సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తూ మన్యం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.


20 ఏనుగులు విజయనగరం జిల్లా ఏజెన్సీని అతలాకుతలం చేస్తున్నాయి. చెరుకు తోటల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. అరటితోటలో అంతుచూస్తాయి. అంతేకాదు ప్రజలపై కూడా దాడిచేస్తున్నాయి. ఏనుగుల గుంపు దాడిలో ఒక గిరిజనుడు తోపాటు అటవీ శాఖకు చెందిన ఉద్యోగి ఒకరు మరణించారు. ఏనుగుల గుంపును గ్రామస్తులు ఎదుర్కొనే క్రమంలో రెండు ఏనుగులు చనిపోయాయి. సహచర ఏనుగులు మరణించే సరికి మిగతా ఏనుగుల ప్రవర్తనల్లో విపరీత మార్పులొచ్చాయి. అడ్డూ అదుపు లేకుండా గ్రామాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యమే ఇప్పుడు విజయనగరం ఏజెన్సీని పట్టిపీడిస్తోంది.



పార్వతీపురం, బందుగాం ప్రాంతాల మధ్య ఉన్న జంతి కొండ బ్లాక్ లో ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఫలితాలు సక్రమంగా ఉంటాయని భావిస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో గ్రామాలు లేకపోవటంతో ఏనుగులు వచ్చే సమస్యలూ లేవని గుర్తించారు. ఇందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ఇదే ఇప్పుడు కలవరం సృష్టిస్తోంది. పార్వతీపురం ఏజెన్సీలో భయం పుట్టిస్తోంది. జంతు కొండకు ఆనుకుని నాలుగు పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 34 గూడేలున్నాయి. వీటిలో సుమారు 10 గ్రామాలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయి. ఏజెన్సీల్లో నివసించే ప్రజలంతా పోడు వ్యవసాయం చేసుకొని బతికే వారు, ఎన్నో ఏళ్ల నుంచి భూమినే నమ్ముకుని బతుకుతున్న వీరికి అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసుకుంటే సర్వే పూర్తయి పట్టాల జారీ వద్ద ఆగింది.



ఇప్పుడు ఇక్కడ ఏనుగుల సంరక్షణ కేంద్రం కనుక సిద్ధమైతే గజం భూమి కూడా వీరికి ఉండదనేది ఆడబిడ్డల ఆవేదన. గిరిజనంలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయడం వారికి ఎలాంటి నష్టం జరగకుండా పునరావాసం కల్పించడం ప్రభుత్వానికి అసాధ్యమేమీ కాదు. అదే రీతిలో ఆలోచిస్తున్నామన్నారు అటవీ శాఖాధికారులు. ఈ ఏనుగులు సంచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని ఒడిస్సాకు తరలించడానికి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అటవీ శాఖాధికారులు నానా యాతన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏజెన్సీలోనే ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది. వీటన్నింటి నేపథ్యంలోంచే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. ఎలిఫెంట్ పార్క్ పేరు మీద నుంచి ఒక ప్రాంతాన్ని ఆ ఏనుగులు ఉంచడానికి వీలుగా కొన్ని చర్యలు తీసుకుంటే బావుంటుందనేది జిల్లా అటవీ శాఖ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపటం జరిగింది.






మరింత సమాచారం తెలుసుకోండి: