స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో పురపాలక ఎన్నికల్లో ముందుకెళ్తామని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు సమస్యలు దొరక్క ఏదో ఒక విమర్శలు చేస్తుంటారని వాటిని తాము పట్టించుకోమన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశం ప్రకారం పార్టీ సంస్థాగత నిర్మాణం పై ప్రస్తుతం దృష్టి పెట్టామని కేటీఆర్ తెలిపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ,27 నుంచి మరి మొన్న 25 నాడు మేం సమీక్ష చేసే నాటికి దాదాపుగా 40 లక్షల పై చిలుకు సభ్యత్వం మొన్నటి వరకు జరిగింది.



అప్పటి నుంచి మళ్లీ ఈ రోజు వరకు మరింత ఉధృతంగా జరిగి దాదాపు 50 లక్షలకి పార్టీ సభ్యత్వం చేరుకుంది అని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్లు గడిచిన 5 సంవత్సరాలుగా చాలా మాటలు చాలా మంది చెప్పారు. కొంతమంది శపథాలు చేసినారు గడ్డాలు తీయమని. మరి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాని పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో విమర్శలూ, ప్రతివిమర్శలూ కొన్ని అత్యంత సహజమైన పని



కానీ మేము ప్రస్తుతం మా పార్టీ అధ్యక్షుల వారి నుంచి  ఆదేశించిందంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయండి. పటిష్టంగా కమిటీ వేయండి. సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టండి. సుశిక్షితులైన సైనికులుగా పార్టీ కార్యకర్తలను తయారు చేసి దానికి జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించండి. ఆ నిర్మాణం చేసిన కార్యాలయాల్లో సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే సంస్థాగత నిర్మాణం బాగుండాలంటే శిక్షణ కార్యక్రమాల చేయమన్నారు. వాటి మీద దృష్టి పెట్టి మేము ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు మీ ముందే బీమా ఏదైతే అనుకున్నామో బీమాకు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశాం. పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతుంది అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: