తెలుగు రాష్ర్టాల లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ లో ఒక ఎమ్మెల్సీ స్థానాని కి ఏపీలో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రం లో యాదవరెడ్డి పై అనర్హత వేటు తో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి అటు ఏపీలో కరణం బలరామకృష్ణమూర్తి,  ఆళ్ల నాని, వీరభద్ర స్వామి రాజీనామా లతో మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 


ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి  నెల ఏడవ తేదీ  నోటిఫికేషన్ వెలువడనుంది నామినేషన్  దాఖలు కు చివరి తేదీ ఆగస్టు పద్నాలుగు,  నెల పదహారు నామినేషన్  పరిశీలన, నామినేషన్  ఉపసంహరణ కు ఆగస్టు పంతొమ్మిది తుది గడువు.  నెల ఇరవై ఆరు  పోలింగ్ జరిగింది. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన ఖాళీల మేర‌కు తెలంగాణ‌లోని యాద‌వ‌రెడ్డికి 2021 మార్చి 3వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ స్థానంలో ఎన్నిక‌య్యే ఎమ్మెస్సీ అప్ప‌టి వ‌ర‌కే ప‌ద‌విలో ఉంటారు. ఇక‌, ఏపీలో కొల‌గొట్ల వీర‌భ‌ద్ర స్వామి స్థానంలో ఎన్నిక అయ్యే ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం సైతం 2021 మార్చి 29 వ‌ర‌కు ఉంటుంది.


అదే విధంగా క‌ర‌ణం బ‌ల‌రాం.. ఆళ్ల నాని స్థానంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక‌య్యే ఎమ్మెల్సీల‌కు మాత్రం గ‌డువు 2023 మార్చి 29 వ‌ర‌కు ఉంటుంది. దీంతో.. ఈ రెండు స్థానాల్లో భ‌ర్తీ అయ్యేందుకు ఔత్సాహికులు ప్ర‌య‌త్నించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌టంతో అధికార పార్టీకి 151 మంది శాస‌న‌స‌భ్యుల బ‌లం ఉంది. ప్ర‌తిప‌క్ష టీడీపీకి కేవ‌లం 23 మంది స‌భ్యుల సంఖ్యా బ‌లం మాత్ర‌మే ఉంది. దీంతో..మూడు స్థానాలు అధికార వైసీపీకే ద‌క్కటం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: