రాజ్యసభలో ఆపరేషన్ ఆకర్ష.ఇప్పుడు నేషనల్ పొలిటికల్ స్క్రీన్ మీద హాట్ టాపిక్ ఇదేనట. సాధారణంగా కొన్ని బిల్లులను వ్యతిరేకించిన ఓటింగ్ వేళ ఆయా పార్టీలు తప్పుకోవడం ఎప్పటినుంచో మనం చూస్తోందే. అయితే తక్షణ తలాక్ నిషేధం బిల్లు ఆమోదం విషయంలో మాత్రం జరిగింది వేరని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయట. విపక్షాల్ని టార్గెట్ చేసుకుని మోదీ సరికొత్త స్కెచ్ గీస్తున్నారా.?  కేంద్రంలో వరుసగా రెండోసారీ ఎన్డీఏ విజయం సాధించింది. వరుసగా రెండోసారీ బీజేపీ పూర్తి మెజార్టీ సాధించింది.


ఇప్పటి కిప్పుడు ఎన్డీయే లోని మిత్రపక్షాలను బయటకు వెళ్లిపోయిన మోదీ ప్రభుత్వానికొచ్చిన ఇబ్బందేం లేదు. లోక్ సభలో బీజేపీ అంత బలంగా ఉంది. కానీ రాజ్య సభలో సీన్ వేరు. ఎండీఏ కి మెజార్టీ లేదు. అయినా తక్షణ తలాక్ నిషేధ బిల్లు ఆమోదం జరిగిపోయింది.కొన్ని పార్టీలు వాకౌట్ చేస్తే, మరి కొన్ని పార్టీల సభ్యుల్లో కొంత మంది హాజరు కాలేదు. సరిగ్గా ఇక్కడే బీజేపీ కొత్త ఎత్తులకు పదును పెడుతుందని డిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. టిడిపి నుంచి నలుగురు ఎంపీలు బీజేపీ లోకి జంప్ చేశారు.



కేవలం ఏపీలో బలపడే క్రమంలో చేసిన వ్యూహం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కోణంలో వివిధ పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులకు కాషాయ కండువాలు కప్పే వ్యూహానికి బీజేపీ పదునుపెడుతుందట. తక్షణ తలాక్ నిషేధ బిల్లుపై ఓటింగ్ జరిగే వేళా బీఎస్పీకి చెందిన నలుగురు ఎంపీలు హాజరు కాలేదు.అలానే ఎస్పీ సభ్యులు కూడా నలుగురు సభలో లేరు. టిడిపి ఎంపీలకు వెల్కం సాంగ్ ప్లే చేసినట్టు గానే రాబోయే రోజుల్లో వీళ్లకు కూడా బీజేపీ స్వాగతం చెప్పడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



పేపర్ మీద లెక్కలు చూస్తే ఎన్ డీ ఏ  ఇతర పక్షాలకి బలమున్నా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాజ్యసభలో అనుకున్నది చేసింది కేంద్ర ప్రభుత్వం. టిడిపి ఎంపీల తరహాలోనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని ఆకర్షిస్తే అది విలీనమౌతుంది.ఒక వేళ అలా సాధ్యం కాని పక్షంలో తమ వైపు ఆసక్తిగా ఉన్న సభ్యులకు వేరే హామీలిచ్చి ఆకర్షించే వ్యూహాన్ని కూడా బీజేపీ పదునుపెడుతోందట.దీంతో అతి త్వరలోనే రాజ్యసభలోను ఎన్డీఏ దే పై చేయి కావడం ఖాయమని కాషాయ కండువాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: