పచ్చదనం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది . కానీ, మొక్కలు నాటాలంటే ఎమ్మెల్యేలూ భయపడిపోతున్నారట. వివరాళ్లో కి వెళ్తే గత యేడాది హరితహారం పథకంలో పాల్గొనటానికి ఎగబడ్డ నేతలంతా ఇప్పుడెందుకు సైలెంటయ్యారు అక్కడక్కడ మొక్కలు నాటుతున్న అవి కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కావటం వెనుక ఆంతర్యమేంటి. అధికారులు ప్రజా ప్రతినిధులకు హరితహారం టార్గెట్ ఉన్నా, పెద్దగా దాని జోలికి ఎందుకు వెళ్లడం లేదు. అసలు అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఈ పరిస్థితికి కారణమేంటి?


ఆదిలాబాద్ జిల్లాలో శాసన సభ సభ్యుల హరితహారం కార్యక్రమం అంటే అంతగా ఆసక్తి చూపడం లేదు మొక్కలు నాటాం అంటే నాటాం అన్నట్టుగా మమ అనిపిస్తున్నారు. కేవలం రోడ్ల వెంట ఫంక్షన్ హాళ్ల ముందు లేదంటే పార్కులు కార్యాలయాల వద్ద తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ మొక్కలు నాటుతున్న దాఖలాలు కనిపించడం లేదు .గతంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేల్లో ఇపుడు ఆ హుషారు కనిపించటం లేదు ఈ పరిస్థితికి కారణం ఆదిలాబాద్ ఎంపీని అంటున్నారు. ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయండని ఆదివాసులకు పిలుపు నిచ్చారు. దాంతో అటు ఫారెస్టు అధికారులు ఇటు ఎమ్మెల్యే లు హరితవనం పనులకు వెనుకడుగేస్తున్నారని తెలుస్తోంది.





పల్లే లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుక్కుంది రాష్ట్ర ప్రభుత్వం అటు అధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే బిజెపి ఎంపి ఆదివాసీ ఉద్యమ నేత సోయం బాబూరావు పోడు భూముల వైపు ఎవరైనా వస్తే తరిమికొట్టండని పిలుపునివ్వడంతో అధికారులు ఎమ్మెల్యేలు సైతం ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుందట. హరితహారం పథకం గత నాలుగేళ్ల కంటే ఈ సారి స్లోగా జరగడానికి ఇంకా చాలా కారణాలే కనిపిస్తున్నాయి.గతంలో హంగు ఆర్భాటాలతో  తెగ హడావిడిగా మొక్కలు నాటే వారు ప్రజాప్రతినిధులు అయితే ఈ సారి ఎంపీ పిలుపు ఎఫెక్ట్ స్థానిక పరిస్థితులతో శోకులకు పోకుండా ఎక్కడో ఒక చోట మొక్కలు నాటే మట్టి నాటామని చెప్పుకోవటానికి ప్రజాప్రతినిధులు తంటాలు పడాల్సి వస్తుందట.


ఉమ్మడి జిల్లాలో పది మంది ఎమ్మెల్యే లుంటే ఐదారు నియోజక వర్గాల్లో అసలు హరితహారం ఊసేలేదంట. మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రొంప నంటించుకోవటం అవసరమా అన్నట్టు దూరంగా ఉంటున్నారట. ఆదిలాబాద్ ఎంపీ పిలుపు పోడు భూములకు సంబంధించి ఆదివాసీల్లో ఉన్న సెంటిమెంటే అందుకు కారణమంటున్నారు. దీనికి తోడు నాటిన మొక్కలు కాపాడకపోతే పదవులు ఊడతాయనే ప్రభుత్వ హెచ్చరికలతో గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటే విషయంలో ప్రజా ప్రతి నిధులు అధికారులు సైలెంటైపోయారట. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో కోటీ ఇరవై మూడు లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం పదిహేను  లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు తెలియజేశారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హరితహారంలో పాల్గొంటున్నారు.



పట్టణం లో ఓకే కానీ మండలాల్లో మాత్రం ఎక్కడా హరితహారం ప్రారంభం కాలేదంటే. ఇక సిర్పూరు టి నియోజకవర్గం లో మొక్కల పంపిణీ జరగక హరితహారం ఊసేలేదంట. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజక వర్గంలో తప్ప , బెల్లంపల్లి మంచిర్యాల సెగ్మెంట్ లలో మొక్కలు నాటడానికి ఎవరూ ఆసక్తిగా లేరంట. నాటిన అరకొర మొక్కలు కూడా సింగరేణి సంస్థ ప్రాంతాల్లో తప్ప ఎక్కడా హరితహారం పనులు కనిపించటం లేదు. ఇక ఆదిలాబాద్ లో కోటి ముప్పై ఆరు లక్షల టార్గెట్ వుండగా ప్రస్తుతం పదహారు లక్షల ఏడు వందల నలభై యొక్క మొక్క లు మాత్రమే నాటారు. అటవీ శాఖ మంత్రి సొంత జిల్లా నిర్మల్ లో రెండు కోట్ల పది లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం పదిహే ను శాతం పనులే పూర్తయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో పన్నెండు శాతం మాత్రమే మొక్కలు నాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: