ఇజ్రాయిల్ కి అమెరికా కి ఆంధ్రప్రదేశ్ కి ఉన్న సంబంధమేంటి ఏపి సియం వైయస్ జగన్ కుటుంబం తో కలిసి ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు అయినా అయిదో తేదీ న తిరిగి అమరావతి వస్తారు. మళ్లీ ఈ నెల పదిహేను వ తేదీ న అమెరికా వెళ్తారు ఇజ్రాయిల్ అమెరికా అమరావతి అన్న చర్చ కేవలం ఈ పర్యటనల గురించి జరగడంలేదు అయిదో తేదీ ఇజ్రాయిల్ నుంచి వచ్చి పదిహేను వ తేదీ అమెరికా వెళ్తారు జగన్. మరి ఈ మధ్య లో ఏపిలో ఏం జరగబోతోంది వైసిపి లో నడుస్తున్న చర్చ  ఇది. 


ఇజ్రాయిల్ అమెరికా పర్యటన మధ్య జగన్ ఏం చేయబోతున్నారు. ఏపీ ఎలక్షన్ లలో ఘన విజయం సాధించిన తర్వాత వైసీపీ లో చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. రోజా పృథ్వీలాంటి నేతలకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే వెలువడ్డాయి.


ఇంకా చాలా నామినేటెడ్ పోస్టు లు పెండింగ్ లోనే ఉన్నాయి చివరకు అలిని ఎఫ్.డీ.సీ చైర్మన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాని ఇందుకు సంబంధించిన ఆదేశాలు మాత్రం వెలువడలేదు ఇజ్రాయిల్ అమెరికా పర్యటన మధ్య ఉన్న గ్యాప్ లో వీటన్నింటి ని క్లియర్ చెబుతున్నారట జగన్. చాలా మంది నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఫోకస్ పెట్టారు. వాటి విషయం లో కూడా జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నాడట వైసిపి నేత రాజశేఖర్ ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబోతున్నారట,  బ్రాహ్మణ కార్పొరేషన్ ఇంకా అనేక కార్పొరేషన్ చైర్మన్ లను కూడా ఈ గ్యాప్ లోనే ప్రకటించబోతున్నారట. 


 ఇప్పటికే ప్రకటించినవి, కొత్తవి అన్నింటికీ సంబంధించిన అధికారిక ఉత్తర్వులూ ఇవ్వనున్నారట. దింతో వైసిపి లో పదవుల పండుగ మొదలైనట్టే అన్న చర్చ ఊపందుకుంది ఇజ్రాయిల్ అమెరికా ఆంధ్రప్రదేశ్ అంటున్న వైసీపీ శ్రేణు లు రెండు పర్యటనల మధ్య గ్యాప్ లో ఎవరిని అదృష్టం వరించనుందో చర్చించుకుంటున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: