చాలా కాలంగా రైతు కుటుంబాలు కడు ధీనంగా అడుగుతున్న డిమాండ్‌ నెరవేరింది. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఈ రోజు విడుదల చేసింది. రైతు ఆత్మహత్య కుటుంబాల న్యాయ పోరాటం ఫలించింది. ఈ కుటుంబాలకు వెన్నంటి ఉండి అండగా నిలిచిన మానవ హక్కుల వేదిక భాద్యులు హరిందర్‌, మహిళా న్యాయవాది వసుదా నాగరాజ్‌ చేసిన శ్రమ ఫలించింది. 


2019-20 ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న 243 రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 6 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మొత్తం రూ. 14.58 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల జారీతో 24 జిల్లాలకు చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 రైతు కుటుంబాలకు పరిహారం వస్తుంది.


250 రైతు కుటుంబాల మటేమిటి?
'' కోర్టు మెట్లు ఎక్కితే కానీ ఈ ప్రభుత్వం స్పందించిందని అర్థం అయ్యింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొంత మంది రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తూ జీవో జారీ చేయడం సంతోషం. అయితే 243 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలకు మాత్రమే ఎస్‌ గ్రేషియా రిలీజ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం అన్యాయం. ఇంకా రాష్ట్రం లో ప్రభుత్వం గుర్తించిన వారే 500 మంది వరకు ఉన్నారు, మరి మిగిలిన ఇంకా 250 కుటుంబాలకు ఎప్పుడు ఎక్స్‌ గ్రేషియా ఇస్తారు.ఒక్క నల్గొండ జిల్లాలోనే 62 మంది భాదితులు ఉంటె కేవలం 45 మందికి మాత్రమే ఎక్స్‌ గ్రేషియా ఇస్తూ ఉత్తర్వులు జరీ చేశారు.మంచిర్యాల లాంటి జిల్లాలో ఒక్క కుటుంబానికి కూడా ఎక్స్‌ గ్రేషియా ఇవ్వలేదు...'' అని ప్రశ్నిస్తున్నారు, ' రైతు స్వరాజ్య వేదిక' ప్రతినిధి కొండల రెడ్డి.


కోర్టు లో కేసు వేశాకే....
నల్గొండ జిల్లా భాదిత కుటుంబాల మహిళలు విసిగి వేసారి మానవ హక్కుల వేదిక,రైతు స్వరాజ్య వేదికను కలిసి కోర్టు లో కేసు వేసి కేసు నోటీసులు అందిన తర్వాతే ప్రభుత్వం ఈ మాత్రం స్పందింది. . ప్రతి రైతు ఆత్మహత్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాము. ప్రభుత్వం గుర్తించిన కుటుంబాలకే కాకుండా ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు ఆత్మహత్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు న్యాయ పరంగా ముందుకు పోతాం అంటున్నారు రైతు నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: