జగన్ అంటే అంతే. తలచుకుంటే ఆలస్యం చేయరు. ఎవరికి ఏమి ఇవ్వాలో బాగా స్టడీ చేస్తారు. ఒకసారి ఇవ్వాలనుకుంటే మాత్రం అది ఎవరి వద్దన్నా ఆగరంటే ఆగరు. తాను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వారిని, వెనకాల నిలబడిన వారిని జగన్ మరచిపోవడంలేదు. తాను అధికారంలో ఉన్నపుడే వారికి న్యాయం చేయగలనని ఆలోచిస్తున్న జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. చాలా  మందికి జగన్ ఆ విధంగానే అవకాశాలు కల్పించారు.


జగన్ మంత్రులుగా పాతికమందిని తీసుకున్నారు. అందరి ఎంపికనూ ఆయన ఆచీ తూచీ చేశారని మంత్రులు ప్రమాణం చేసినపుడే అనిపించింది. ఇక మంత్రి పదవులు ఇవ్వలేని వారిని జగన్ వేరే మార్గాలలో అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వ విప్ లుగా, చీఫ్ విప్ లుగా చాన్స్ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవులు కూడా అనేక మందికి ఇచ్చారు. వారి హోదాలను కూడా ఒక్కసారిగా పెంచేశారు. సాధారణంగా చీఫ్ విప్ కి మాత్రమే క్యాబినెట్ హోదా ఉంటుంది. కానీ జగన్  సాధారణ విప్ లకు కూడా అదే హోదా కల్పిస్తూ వారిని కూడా మంత్రులతో సమానం చేశారు.


ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ లు బూడి ముత్యాలనాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారికి క్యాబినెట్ హోదా ను ఇస్తూ వైసీపీ సర్కార్ లేటెస్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో వారంతా హ్యాపీగా  ఉన్నారు. విశాఖ జిల్లా వరకూ చూస్తే బూడి ముత్యాలనాయుడు జగన్ని నమ్ముకుని ఉన్నారు.


మాడుగుల నుంచి రెండవమారు గెలిచిన ఆయన జగన్ తోనే తన జీవితం అన్నారు. టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా వ్యవహరించారు.  దానికి ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. అయితే సామాజికవర్గ సమీకరణలతో అది నెరవేరకపోయినా జగన్ ప్రభుత్వ విప్ ని చేశారు, ఇపుడు క్యాబినెట్ హోదా కూడా ఇవ్వడంతో బూడి మంత్రి అయినట్లుగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: