మొన్నటి ఎన్నికల్లో మందలగిరి సారీ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి నారా లోకేష్ పరువు సాంతం పోగొట్టుకున్నారు. సరే టిడిపికి కూడా ఘోర పరాజయం తప్పలేదు కాబట్టి లోకేష్ ఓటమిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ కాస్త సంయమనం పాటించుంటే బాగుండేది. కానీ ట్విట్టర్లో రెచ్చిపోయి తన అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. అందుకనే నెటిజన్లు కూడా తప్పుడు ట్వీట్లు చేస్తున్న లోకేష్ ను విపరీతంగా వాయించేస్తున్నారు.

 

 ట్వీట్లతో జగన్ పై రెచ్చిపోతున్న లోకేష్ కు మ్యాటర్ ఎవరిస్తున్నారో ? ఎవరు సలహాలిప్తున్నారో తెలీదు. అయితే చినబాబు పెడుతున్న ట్వీట్లలో చాలామటుకు తప్పుడువే ఉంటున్నాయి. తన తండ్రి హయాంలో జరిగిన తప్పులకు కూడా చినబాబు జగన్ నే బాధ్యత వహించమంటున్నారు. అయినదానికి కానిదానికి జగన్ ను టార్గెట్ గా చేసుకుని మరీ ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు పెడుతూ అభాసుపాలవుతున్నారు.

 

రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు అప్పు ఇవ్వను అని చెప్పినపుడు కూడా బుర్రలో ఎంత తోస్తే అంతా ట్వీట్ చేసి జగన్ ను బాగా ఎగతాళి చేశారు. అయితే అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకోవటంలో రాష్ట్రప్రభుత్వం తప్పేమీ లేదని ప్రపంచ బ్యాంకే స్వయంగా చెప్పటంతో లోకేష్ కు ఏమి చేయాలో అర్ధం కాలేదు. అలాగే గ్రామ సచివాలయాలు ఏర్పాటు, గ్రామ వాలంటీర్ల ఎంపిక, రైతులకు విత్తనాల కొరత, అన్న క్యాంటిన్లు మూతపడినపుడు ఇలా..చాలా అంశాలపైనే ట్వీట్ చేస్తున్నారు ప్రతిరోజు.

 

 అయితే ఏ విషయంలో కూడా లోకేష్ కు సరైన పరిజ్ఞానం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనని చెప్పటానికి కారణం కేంద్రప్రభుత్వ వైఖరి. రైతులకు విత్తనాల కొరత వచ్చిందంటే అందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం పనికిమాలిన తనమే కారణం. అన్న క్యాంటిన్లు మూతేశారంటే తొందరలోనే మళ్ళీ తెరుస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే తనకు ఏమీ తెలీకపోయినా అన్నీ తెలుసనుని లోకేష్ రెచ్చిపోతుంటే నెటిజన్లు ట్రోలింగ్ తో వాయించేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: