పోలవరం కాంట్రాక్ట్ పనులు చేస్తున్న నవయుగ సంస్థను తప్పించడం దారుణమన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. ఆ కంపెనీ పై ఎలాంటి ఆరోపణలు లేక పోయినా నోటీసు లేకుండానే ప్రభుత్వం కన్వీనియన్స్ కోసమంటూ తప్పించారని చెప్పారు టిడిపి నేత ఉమ. కేవలం టిడిపిపై బురద జల్లేందుకే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు దేవినేని ఉమ. దీనిపై దేవినేని ఉమ మాట్లాడుతూ.. "ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఎక్స్ టార్డినరీ కండిషన్ ఉపయోగించారు.



అగ్రిమెంట్ నిబంధనలలో ఇక్కడ పని చేస్తున్న అధికారులు తప్పు చేశారనో, లేకపోతే ఏజెన్సీ తప్పు చేసిందనో ఇవేవీ లేకుండా కేవలం 89.3 లో మా కన్వీనియెన్స్ కోసం వారు కన్వీనియన్స్ మేం ఏ వర్గం ఏ విధంగా కన్సంట్ నిచ్చి వెళ్ళిపొమ్మన్నామని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇచ్చింది అని నేను జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను.  మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల్లో, ఇరిగేషన్ మంత్రి గారిని తెలుగుదేశం సభ్యులు అడిగారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఎలా జరుగుతున్నాయని. పనులు పురోగతిలో ఉన్నాయని ఇరిగేషన్ మంత్రి శాసన సభలో చెప్పటం జరిగింది.




ఇవాళ ఎటువంటి ఎలిగేషన్ లు లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గుడ్డ కాల్చి నెత్తిమీద వేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరుగుతున్న పనుల్ని ఇవాళ ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక కక్షతో, కుట్రతో కుతంత్రాలతో తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద చల్లాలని మీరు అవినీతిలో కూరుకుపోయి,మీరు ఇవాళ్ళ సీబీఐ ఈడీ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి 16 నెలలు జైలు జీవితం గడిపి ఇవాళ అవకాశం వచ్చిందని, ఇవాళ జరుగుతున్న ఒక మహాయజ్ఞంలాగా జరుగుతున్న ప్రాజెక్ట్ లో ఈ విధంగా స్పిల్ వేలో కేవలం అక్కడ స్పిల్ వే ఎత్తులేపి గేట్లు పెట్టుకొని మట్టి కట్ట కట్టడం, ఆ మట్టికట్ట కాంట్రాక్టుల కోసం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు." అని ఆయన పేర్కొన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: