ఆదివారం ప్రభుత్వానికి, స్కూల్లకి, సాఫ్ట్ వేర్ సంస్ధలకు సెలవు అని అందరికీ తెలుసు, కానీ సోమవారం కాడెద్దులకు సెలవు అన్న విషయం చాలా మందికి తెలీదు. ఎద్దులకు సెలవేంటీ అని ఆశ్చర్యపోతున్నారు, ఇంతకు వృషభాలకు సెలవు ఏంటీ అని అనుకుంటున్నారా. కర్నూలు జిల్లాలో గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగానే వృషభాలకు కూడా సాధారణ సెలవు ఉందంట.


హాలిడే అంటే అట్లాంటి ఇట్లాంటి హాలిడే కాదండి రోజంతా పూజలు, రంగురంగుల అలంకరణలతో ఎద్దులు జిగేల్ జిగేల్ మంటూ కనిపిస్తున్నాయట. సోమవారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కాడెద్దులకు సెలవు అని ప్రకటించడం వెనుక పెద్ద కథే ఉంది. మామూలుగా అయితే ఏరువాక పౌర్ణమి రోజున ఎద్దులను ముస్తాబు చేసి పొలానికి వెళ్లి రైతులు అరక వేస్తారు. కానీ కర్నూలు  జిల్లాలో హాలహర్వి మండలం విరుపాపురం గ్రామాల్లో అయితే ప్రతి సోమవారం ఎద్దులను ప్రత్యేకంగా చూస్తారు. తెల్లవారు జామున కోడి కూత వినగానే రైతులు నిద్రలేచి ఎద్దులను శుభ్రపరుస్తారు.


విభిన్న వర్ణాలు ఉండే వస్తువులతో అలంకరిస్తారు. అనంతరం ఇంటిల్లిపాది ప్రత్యేక పూజలు చేస్తారు. రోజంతా నియమ నిష్టలతో ఉంటూ బసవన్నలను తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. విరూపాపురం గ్రామస్తులు మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ చూపడం వెనుక ఓ కారణం ఉంది అంటున్నారు. ఈ ఊరి ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఏమనగా  గ్రామంలో బొగ్గుట్ట బసవేశ్వరస్వామి వెలిశాడు. స్వామి వారి కోరిక మేరకు ఆ వూళ్లో ని అన్నదాతలు బసవేశ్వరస్వామి ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అదే తరహాలో వృషభాలను పూజిస్తారు. ఖరీఫ్ రబీ సీజన్ ఏదైనా సరే పొలం పనులు ఎన్ని ఉన్నా సోమవారం మాత్రం వ్యవసాయ పనులన్నింటినీ పక్కన పెడతారు.



అయితే ఈ సాంప్రదాయాన్ని తరతరాలుగా పాటించటం ఇక్కడి విశేషం. గవర్నమెంట్ ఎంప్లాయికి ఆదివారం ఏ రకంగా ఐతే సెలవులు ఉంటాయో అదే విధంగా ఎద్దులకు సెలవు ప్రకటించి, వాటిని పూజించడం,ఎట్లాంటి పరిస్తితి ఐనా వాటికి కాడే కట్టరు. ఎద్దులను ఇలా పూజించుకోవడం  చాలా సంతోషంగా ఉందని ఆ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. బల్లకట్టు విశ్వేశ్వరస్వామి దేవస్థానం, మంగళవారం శ్రీ బసవేశ్వర స్వామి ఈ రోజుల్లో ఇతరులకు  కష్టం వచ్చినా కానీ ఎంత పరిస్థితి వచ్చిన గానీ వరిని సాగు చెయ్యము. అదే విధంగా ఇంట్లో  చికెన్, మటన్ లాంటి  మాంసాహారాల్ని ముట్టరు. అలాగే ఎలాంటి  అడవి జంతువులను వేటాడటం లాంటి పనులను చేయకుండా శుభ్రంగా స్నానం చేసి, ఎద్దులను అలంకరించి వాటిని బసవేశ్వరుడి గుడికి తీసుకువెళ్లి వాటికి పూజలు ఆచరిస్తారట ఆ గ్రామ ప్రజలు.


ఈ ఊరి ప్రజలు మరో సాంప్రదాయాన్ని కూడా పాటిస్తున్నారు ఊరిలో ఎవరికైనా మగబిడ్డ పుడితే బోలగుట్టప్పా అని ఆడపిల్ల పుడితే బొర్లగుట్టమ్మా, బసమ్మ అని పేర్లు పెట్టటం సర్వసాధారణమైంది. తాత ముత్తాతల కాలం నుంచి పాటిస్తున్న ఆచారాన్ని తమ తరం వారు కూడా పాటించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికి ఓ వైపు తమ ఇష్టదైవం బసవేశ్వరుడికి ప్రీతి కరమైన రోజైన సోమవారం నాడు బసవన్నలకు సెలవు ఇవ్వడం పిల్లలకు బసవేశ్వరుడి పేరుపెట్టుకోవటం పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: