నెల్లూరు జిల్లా మూలపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి నేత మాజీ కౌన్సిలర్ సుధాకర్ పై హత్యాయత్నం జరిగింది. కొందరు దుండగులు అయనను కత్తితో పొడిచి పరారయ్యారు. వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంటూ సుధాకర్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉదయం సుధాకర్ ఇంటి వద్దకు వచ్చిన వైసీపీ కార్యకర్త హరి మాట్లాడుతూ కత్తితో దాడి చేశాడని బాధితుడు సుధాకర్ అంటున్నారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



ఈ రోజు ఉదయం తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ అయిన పగడాల సుధాకర్ పై ప్రత్యర్థులు దాడి చేశారు. అయితే ఇతను గతంలో 2014 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేశారు. ఆ తర్వాత మేయర్ పార్టీ మారిన నేపథ్యంలో ఇతను కూడా పార్టీ మారినట్టు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో మేయర్ నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేశాడు. ఈ నేపథ్యంలో అతనికి అప్పటిలో స్థానికంగా ఉన్న మరొ హరి అనే వైయస్ఆర్ సిపి కార్యకర్తకు ఇతనకు మధ్య గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.



ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు,ఎన్నికల తర్వాత ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ గతంలో పరిచయస్థులు లాగానే మాట్లాడుకునేవారు. అయితే ఈ రోజు ఉదయం హరి,సుధాకర్ ఇంటి వద్దకు వచ్చి మాటా మాటా వాగ్వాదం పెరిగి ఒక్క సారిగా కత్తితో దాడి చేశాడని చెప్పాడు. కత్తితో దాడి చేసినప్పుడు కత్తిని పట్టుకోవడంతో పాటు కొంత వెనుకవైపున గాయాలుతగిలాయని సుధాకర్ అంటున్నాడు. సుధాకర్ ను వెంటనే అక్కడ ఉన్న అతని కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.



ప్రభుత్వాసుపత్రుల్లో అతనికి వీపు వెనుక భాగాన ఆరు కుట్లు పడ్డాయి. అంతేకాకుండా రెండు చేతులకి కూడా గాయాలయ్యాయి. అయితే ఈ సంఘటన కేవలం తనను ఎన్నికల్లో వ్యతిరేకంగా పని చేశానని తన మీద వైయస్ ఆర్ సిపి నాయకులు దాడి చేశారని సుధాకర్ అంటున్నాడు.మరోవైపు గాయపడిన సుధాకర్ ను పరామర్శించడానికి పెద్ద సంఖ్యలో టీడిపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రికి తరలి వచ్చారు. అంటే ఇది రెండో ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.



ముఖ్యంగా గతంలో డిఎన్ యస్ జిల్లా అధ్యక్షుడు కుడా దాడి జరిగిందని తర్వాత ఇది మరోసారి ఇలాంటి ఘటన జరుగుతుందని ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని తమ కార్యకర్తలకు న్యాయం జరిపించాలని అంటున్నారు. అయితే మరోవైపు పోలీసులు హరి,సుధాకర్ ల మధ్య ఏమైన వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. పూర్తిగా సమగ్ర దర్యాప్తు తర్వాతనే అసలు విషయాలు బయటపడతాయని పోలీసులంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: