యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం సృష్టిస్తోంది. మోత్కూరు మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉచ్చు బిగించి మరి జింకను చంపారు. ఆ తర్వాత పదిహేను మంది ఈ జింక మాంసాన్ని వండుకొని తిన్నారు. ఇందులో పలువురు రాజకీయ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జింకల వేట పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ ఇంకా యధేచ్ఛగా వీటి వేట కొనసాగుతూనే ఉంది. అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఇటు పోలీసు శాఖకు సంబంధించి అధికారుల నిఘా లేకపోవడంతో చాలా వరకు నిర్మానుష్యమైన ప్రాంతాలు అటవీ శాఖకు సంబంధించి ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జింకల వేట కొనసాగుతుంది.


తోటలో పదిహేను రోజుల క్రితం ఒక జింక ఉచ్చులో ఇరుక్కుంది.ఆ ఉచ్చులో ఇరుక్కున్న జింకను ఇక్కడ గ్రామానికి సంబంధించిన ముగ్గురు నవీన్, రాములు, దశరథ్ వీళ్లు ముగ్గురూ కలిసి కూడా ఆ జింకను చంపి, దానికి సంబంధించిన మాంసాన్ని తీసుకొని తినడం జరిగింది.అక్కడ ఒక వైరు దొరికింది.ఈ వైర్ టూ వీలర్ కు వాడతారు. ఎక్సలేటర్ వైర్ ఇది. ఈ వైరుతోటి ఉచ్చును ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే ఆ జింక రోజు ఇదే ప్రాంతం నుండి తిరుగుతూ తన ఆహారం తినడం తరువాత లోపలికి వెళ్లిపోవడం చేస్తూ ఉంటుంది.



దాన్ని వీళ్లు గుర్తించడం జరిగింది, గ్రామస్తులు ఈ ముగ్గురు కూడా, గుర్తించి ఒక ఉచ్చును ఏర్పాటు చేశారు.ఆ ఉచ్చులో అది పదిహేను రోజుల క్రితం పడిపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక రైతు ఆ ఉచ్చులో పడ్డ జింకని చూచి వదిలేయాలని కూడా వాళ్ళ ముగ్గురికీ చెప్పారు. కానీ వాళ్లు మాత్రం వినలేదు వాళ్ళు ఆ జింకను చంపి మొత్తం పదిహేను మందికి దాన్ని పంచినట్లు కూడా వాళ్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈ విషయం పదిహేను రోజుల క్రితం జరిగితే రెండ్రోజుల క్రితమే వెలుగులోకి రావడం జరిగింది. అది కూడా గ్రామంలో ఉన్న కొంత మంది మద్యం తాగుతున్న సమయంలో వెలుగులోకి రావడంతో ఒక్క సారిగా ఈ జింక చంపిన విషయం తెలిసింది అందరికీ. వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.



నిన్న అక్కడికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లు వచ్చి అవసరమైన ఆనవాళ్లు సేకరించడం జరిగింది. వర్షం కారణంగా పూర్తిగా జింక గుర్తులన్ని చెరిగిపోయాయి, కానీ ఆ మొత్తం అవి అన్ని ఆ అచ్చులు ఏవైతే పాదముద్రలు ఉన్నాయో అవన్నీ కూడా జింకకు సంబంధించినవనేది ప్రధానంగా అధికారులు కూడా చెపుతున్నారు. అలాగే ఈ ముగ్గురు ఇండ్ల వద్ద కూడా పెంట ఏదైతే ఉంటుందో, దాంట్లో కొన్ని బొక్కలను కూడా తీసుకోవడం జరిగింది. వాళ్లు ఉచ్చులో పడ్డ జింకను వదిలేయకుండా ఒక బరిశ ద్వారా దాన్ని చంపారు. చంపి తోలు మొత్తం తీసిన తరువాత వాటిని ఊర్లో ఉన్న కొంత మందితో పాటు కొంత మంది రాజకీయ నాయకులకు గూడా ఈ జింకను ఇచ్చినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఐతే ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్లు ముగ్గురు కూడా పరారైపోయారు. అక్కడ మద్యం బాటిళ్ళు కూడా ఉన్నాయి.




ఇక్కడ సుమారు 300 లకు పైగా కూడా నెమళ్లు ఉన్నాయి. అలాగే జింకలు కూడా ఉన్నాయి.ఎందుకంటే చుట్టూ చాలా నిర్మానుష్యమైన ప్రాంతము అటవీ ఎక్కువగా దట్టమైన అడవి ఎక్కువగా కనబడుతుంది. అలాంటి ప్రాంతంలో ఇవి వచ్చి వాటికి కావలసిన వాటిని తిని వెళ్తూ ఉంటాయి. వీటిని గుర్తించిన ఈ ముగ్గురు కూడా జింకను వేటాడటం జరిగింది. ఉచ్చును ఏర్పాటు చేసి మరీ దాన్ని చంపటం జరిగింది. జింకను చంపొద్దని పూర్తి స్థాయిలో నిషేధం ఉన్నదని తెలిసినప్పటికీ వాళ్లు యదేచ్చగా చేస్తున్నారు. ఒక జింకనే కాదు నెమళ్లను కూడా ఇక్కడ వీళ్ళు ఇష్టానుసారంగా చంపడం, వాటిని తినటమనేది చేస్తున్నట్లు కూడా గ్రామస్తులు చెబుతున్నారు, కానీ నేరుగా వచ్చి మాట్లాడ్డానికి అందరూ భయపడుతున్న పరిస్థితి గ్రామంలో ఉంది. ప్రస్తుతానికైతే అటవిశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.



ఉచ్చు ఏర్పాటు చేసి మరీ దాన్ని చంపారంటే చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే చేసినట్లు గానే మనకు తెలుస్తుంది.ఏవైతే ఎముకలుంటాయో వాటిని ఫోరెన్సిక్ కి పంపించడం కూడా జరిగింది.ఆ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తును వేగవంతం చేసే అవకాశమైతే ఉంది. మోత్కూరు నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల లోపలికి అడవీ ప్రాంతం లోపలికి రావలసి ఉంటుంది. ఇక్కడ ఎవరికి కూడా సరైన నిఘా అనేది ఉండదు. ఎందుకంటే పోలీసులు రారు, అటవీశాఖాధికారులు రారు. ఒకవేళ తెలిసినా గ్రామస్థులకే తెలుస్తుంది కాబట్టి గ్రామస్తులు కూడా ఎవరూ నోరు విప్పని పరిస్థితి ఉంది కాబట్టే వాళ్లు యధేచ్చగా ఈ జింకను చంపారు. ఒక జింకనే కాదు గతంలో కూడా నెమళ్ళను కూడా చంపి తిన్నట్లు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కొండాపూర్ గ్రామంలో మనకు కనపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: