ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో విడిపోవడంతో, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక అనుభవజ్ఞుడైన నాయకుడైతే సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లగలరని భావించి, 2014 ఎన్నికల సమయంలో టిడిపి పార్టీకి తాము మద్దతు ఇవ్వడం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అధికారాన్ని చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సహా కొందరు టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, ఆ తరువాత కొన్నాళ్ళకు జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఇక మొన్నటి 2019 ఎన్నికల సమయంలో జనసేన ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. 

ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మ్రోగించి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్కటిగా ప్రజాసంక్షేమ పథకాలపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గారి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న కొన్ని విమర్శలు చేయడం జరిగింది. జగన్ గారిపై కేసులు ఉండబట్టే కదా, వాటినుండి బయటపడేందుకు ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ తిరగగలిగారు. అదే ఆయనపై అటువంటివి ఏవి లేకపోతే, ఆయన కూర్చునే రాజకీయం చేసేవారు కదా అంటూ జగన్ ను విమర్శించడం జరిగింది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు, రెండు మూడు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యల పై కొందరు వైసిపి నాయకులు పవన్ పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మరికొందరు వైసిపి నాయకులు మాట్లాడుతూ, తాము మరియు తమ అధినేత ప్రజలకు నీతి, 

నిజాయితీలతో కూడిన పాలనను అందివ్వాలనే భావనతో మొన్నటి ఎన్నికల్లో గెలుపు తరువాత ఆ విధంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నామని, కానీ పవన్ గారు ప్రస్తుతం జగన్ గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు కొంత ఆవేదన కలిగించాయని అంటున్నారట. వాస్తవానికి తమ పార్టీలోని చాలామందికి పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగతంగా చాలా మంచి అభిప్రాయం ఉండేదని, అయితే ఈ వ్యాఖ్యలతో పవన్ కూడా అందరిలాంటి వారే అని నిరూపించుకున్నారని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఇక ఈ వివాదం పై కొందరు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ, పవన్ గారు, జగన్ పై ఆ విధంగా వ్యాఖ్యానించకుండా ఉండాల్సిందని, ఎందుకంటే ఆయన పై పెట్టిన కేసులు ఆధారం చేసుకుని వ్యాఖ్యానించడం సరైనది కాదని వారు అంటున్నారు .....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: