అయోధ్యలో రామ మందిరం బాబ్రీ మసీదు వివాదం కేసులో ముస్లింలు ప్రార్థనలు ఎక్కడైనా చేయొచ్చా, ఖచ్చితంగా మసీదు లోనే నమాజ్ చేయాలా అన్న అంశానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై రెండు లో సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ముస్లిం లు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ప్రార్థన మందిరం అవసరం లేదని సుప్రీం ధర్మాసనం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో స్పష్టం చేసింది.వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలంటూ రెండు వేల పదిలో అలహాబాద్ కోర్టు వెల్లడించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది.



రెండు మతాలకు చెందిన అంశం కావడంతో ఇరవై ఆరు ఏళ్లుగా తుది తీర్పు పెండింగ్ లోనే ఉంది.నమాజ్ చేసుకునేందుకు స్థలం కేటాయించినా ముస్లిం సంఘాలు అందుకు అంగీకరించలేదు.మరోవైపు రామజన్మభూమి అయోధ్యలో రాముడి మందిరాన్ని కూల్చేసి మొగల్ పాలకుడు బాబర్ కాలంలో బాబ్రీ మసీదు కట్టారని అందుకే మందిరం నిర్మాణం చేపట్టేలా తీర్పివ్వాలని హిందూ సంఘాలు వాదనలు వినిపించాయి.ఐతే అయోధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. అయోధ్య వివాదం పై మధ్య వర్తుల కమిటీ ఎలాంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. దీంతో ఈ నెల ఆరు నుంచి అయోధ్య వివాదం పై ఓపెన్ కోర్టు లో రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది అయోధ్య వివాదానికి మధ్య వర్తుల కమిటీ ఎలాంటి సామరస్య పరిష్కారాన్ని చూపించలేకపోయిందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు



అయోధ్య వివాదంపై నిన్ననే సుప్రీంకోర్టుకు మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ మధ్య వర్తుల కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక పైన  చీఫ్ జస్టిస్ మాట్లాడారు. ఈ నివేదికకు పరిష్కారాలేవి సూచించలేదు అన్న విషయాన్ని తెలిపింది. అయోధ్య కేసు వ్యవహారాన్ని ఆగస్టు ఆరు వ తారీకు నుంచి ప్రతి రోజూ సుప్రీం కోర్టు విచారణకు చేపడుతుందని స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక పైన ఆగస్టు ఆరు వ తారీకు నుంచి సుప్రీం కోర్టు ఈ అయోధ్య వివాదంపైన ప్రతి రోజు విచారణను చేస్తూ ఈ అంశాన్ని త్వరగా విడుదల చేయటానికి ప్రయత్నం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: