నాగుల చవితి నాడు పుణ్యం పేరిట జరిగే ఒక ఘోరాన్ని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కర్ణాటకలోని ఓ ప్రాచీన మందిరం అక్కడ పుణ్యం పేరిట ఏటా ఓ వింత జరుగుతుంది. ఎంగిలాకుల మీద పొర్లు దండాలు పెడితే చాలంట.ఎలాంటి చర్మవ్యాధులైన ఇట్టే మాయమైపోతాయంట. చూడగానే అసహ్యం పుట్టించే ఈ వింత ఆచారం కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ప్రతి ఏడాది జరుగుతుంది. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మంగుళూరు దగ్గర్లోని సుగ్లియా అనే ఊర్లో ఉంది.





సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఈ ఆచారం ఇప్పుడు కాదు 500 ఏళ్ళ నుంచి సాగుతూనే వుంది. సర్పదోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ఎంతో ప్రసిద్ధి. ఈ గుడిలో ప్రధాన పర్వదినమైన నాగుల చవితి నాడు అనేకమంది యాత్రికులు వస్తారు. వీరితోపాటు ఆశ్లేష, బలిపూజా, సర్పసంస్కారం ఇలాంటివి రకరకాల పూజలు ఈ గుళ్లో చేస్తారు. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబరు మొదటి వారంలో నిర్వహించే చెంపా షష్టి వేడుకనాడు ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుపుతారు.



ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకుల్లో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకుల్ని అక్కడే ఉంచుతారు. ఊళ్లోని దళితులు గిరిజనులు ఆకులపై పొర్లు దండాలు పెడతారు. ఇలా చేస్తే వారికొచ్చే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని పాపాలన్నీ పోతాయని బలంగా నమ్ముతారు. పొర్లుదండాల పెడుతున్న భక్తుల్లో అత్యున్నత చదువులు చదివిన వారు కూడా ఉండటం గమనార్హం. ఎందుకంటే నమ్మకానికి మూర్కత్వానికి సరిహద్దు చెరిపేసిన విచిత్ర సంప్రదాయమిది.మధ్య తరగతి కుటుంబీకులు, ఇంజినీర్ లు, టీచర్ లు, వైద్యులు, న్యాయవాదులు ఒకళ్లా ఇద్దరా ఎందరో ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఐదు వందల ఏళ్లు గా దురాచారం చాకుతో తాజాగ కోర్టుకెక్కడంతో కొన్ని మార్పులు చేసి ఎంగిలాకుల స్థానంలో స్వామి వారి ప్రసాదం ఆకులు పెట్టి ఇప్పుడు వాటిపై దొర్లుతుంటారు. ఏ రాయి అయితేనేం దెబ్బ తగలటానికి అన్నట్టుంది విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: