ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని చూస్తే అసహ్యం కలుగుతోంది అంటూ ట్విట్ చేశారు. 


తను ఒకలా ట్విట్ చేస్తే, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరొకలా ట్విట్ ని సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, అతను చేసిన ట్విట్, వైసీపీ కార్యకర్తలు చేసిన ట్విట్ పోస్ట్ చేస్తూ ఇది ఒరిజినల్, ఇది ఫేక్ అంటూ మండిపడ్డారు నారా లోకేష్. ''సున్నావడ్డీ రుణాల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని నేను పోస్ట్ చేస్తే, దాన్ని పక్కదోవ పట్టించి, వాళ్ళ జగన్ గారు రైతులకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధించడానికి నైతిక విలువలు వదిలేసి అబద్ధాలు సృష్టిస్తున్నారు.   


వాళ్ళ అన్న పడేసే చిల్లర ఉండగా, ఇంక రైతుల కష్టనష్టాలతో వాళ్ళకి పని ఏముంది? ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని చూస్తే అసహ్యం కలుగుతోంది. ఇలా చిల్లర వేషాలతో ప్రజాసమస్యలను అపహాస్యం చేస్తుంటే ఇక ఊరుకునేది లేదు.' అంటూ ట్విట్ చేశారు నారా లోకేష్. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'కార్యకర్తలు మార్ఫింగ్ చెయ్యడం తప్పే కానీ వైసీపీ రెండు నెలల ప్రభుత్వాన్ని విమర్శించడంలో మీది లేదా తప్పు ? అంటూ ఒకరు ప్రశ్నిస్తే. మరికొందరు ట్విట్ చేస్తూ 'నువ్వు చూసావా కార్యకర్తలకు పేటీఎం లో డబ్బు ఇవ్వడం ?' అంటూ ఘాటుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: