ఇత్తడి వారి చేతిలో పడితే పుత్తడిలా మెరుస్తుంది. ఇత్తడిని రాగితో కలిపి దేవతామూర్తులకు అందమైన అలంకరణలు వస్తువులుగా తీర్చిదిద్దుతారు. చేతి వేళ్ల కదలికలతో అందమైన ఆకృతులకు ప్రాణం పోస్తారు. వివిధ ఆకృతుల్లో బొమ్మలూ ధ్వజస్థంభాల తొడుగుల వంటి విలువైన కళాకృతులను తయారు చేయటంలో వీరిది అందెవేసిన చెయ్యి. అయితే వారి బతుకుల్లో మాత్రం జీవం కనిపించదు, నమ్ముకున్న కల కడుపు నింపలేదు. వంశపారంపర్యంగా సంక్రమించిన కలను వదలలేక మరో పని చేయలేక జీవచ్చవాలుగా బతుకులీడుస్తున్న రాయలసీమలోని ఒనిపెంట లో ఇత్తడి, రాగి బొమ్మల తయారీ కుటుంబాల బతుకుచిత్రంను ఈ విధంగా ఉంది. రాయలసీమలోని కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఒనిపెంట  గ్రామం ఇత్తడి, రాగి పరిశ్రమకు పెట్టింది పేరు.



ఇత్తడి రేకులును కరిగించి తీగలుగా మార్చి చేతి వేళ్ళ కదలికలతో అందమైన ఆకృతులని చెయ్యడంలో వరికుంట కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. పనిలో సృజనాత్మకత కొత్త ధనాన్ని చూపిస్తూ ఇక్కడి కళాకారులు ఇత్తడి పరిశ్రమకు జీవం పోస్తున్నారు. అందుకే ఒకప్పుడు వరికుంట కంశాల వారీ కుంటగా పిలిచేవారట. అన్ని కులాలవారూ మిళితమై ఇక్కడా ఇత్తడి పరిశ్రమకు జీవం పోశారు. గతంలో సుమారు ఐదు వందల కుటుంబాలు ఈ వృత్తులలో ఉండేవారు. ఇక్కడి కళాకారులు తయారు చేసిన కళాకృతులు ఒకప్పుడు సింగపూర్ లాంటి దేశాల మార్కెట్ లకు ఇక్కడి కళాఖండాలు ఎగుమతి చేయబడ్డాయి.



దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జిబిషన్ లో ఇత్తడి కళాఖండాలు ప్రదర్శింపబడ్డాయి.సిల్వర్, స్టిల్, ప్లాస్టిక్ నుంచి వినియోగదారుడి దృష్టి మళ్లించగలిగితే ఇత్తడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కళాకారుడు సిద్ధంగా ఉన్నారు. ప్లాస్టిక్, స్టీల్ వచ్చి ఇత్తడి పరిశ్రమపై ప్రభావం చూపింది. చాలా మంది కళాకారులు ఈ కలను వదులుకున్నారు. ఇత్తడి పరిశ్రమలు ఉపాధి లేకపోవడంతో చాలా కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఇతర జిల్లాలకు వలస పోయారు. కొంతమంది పొలం పనులకు వెళ్తున్నారు. ఒకనాడు ఒనిపెంటకు ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉండేవి. ఇప్పుడు వలసలతో చిన్నపోయింది.



అయితే కొందరు ఈ ప్రాచీన కళకు జీవం పోస్తూ దేవాలయాల కలాసాలు, ధ్వజస్తంభాలు, మకరతోరణాలు, ఉత్సవ విగ్రహాలు తయారు చేసి పొట్టపోసుకుంటున్నారు.కళాకారుల సృజనాత్మకతను గుర్తించినా లేపాక్షి హస్తకళల సంస్థ డీఆర్ డీఏ శిక్షణ ఇచ్చింది. కనుమరుగవుతున్న ఇత్తడి పరిశ్రమను నిలబెట్టాలని ఒనిపెంట లో పదిహేడు లక్షల నిధులతో ఒకటి పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాల కేంద్రం నిర్మించారు.



ప్లాస్టిక్, స్టీల్ వాడకం పెరగడంతో కనుమరుగవుతున్న ఇత్తడి పరిశ్రమకు ప్రభుత్వం చేయూత నిచ్చి ఆదుకుంటుందా, ప్రభుత్వం ఇత్తడి పరిశ్రమ కార్మికులకు రుణాలు వృద్ధ కార్మికులకు పింఛన్ లు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి ప్రాచీన కళలు కళాకారులే కాపాడాలని దీనంగా వేడుకుంటున్న కళాకారుల బతుకుల్లో వెలుగు నింపుతుందో లేదో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: