బోండా ఉమామహేశ్వర రావు.. విజయవాడలో తెలుగుదేశం కాపు నేత.. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారడం ఖాయం అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ ఇది ఒక రూమర్ గా ఉండేది.. తెలుగుదేశం అనుకూల మీడియాగా పేరున్న పత్రికల్లోనే ఈ వార్తలు వచ్చాయి.బోండా ఉమ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన ఆగస్ట్ 4, 5 తేదీల్లో విజయవాడ వస్తారు.


ఆ తర్వాత ఈ చేరిక విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోండా ఉమకు బెజవాడలోని కాపు సామాజిక వర్గంపై పట్టుంది. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు సంచలనం సృష్టిస్తోంది.. ఆస్ట్రేలియా పర్యటన సందర్బంగా అక్కడ బంగి జంపింగ్ చేస్తున్న ద్యశ్యం పోటోను కూడా జత చేశారు. ఆ ఫోటోకు ఆయన పెట్టిన క్యాప్షన్ కూడా అనుమానాలు పెంచేలా ఉంది.


హలో బెజవాడ..!.. నా తర్వాత రాజకీయ అడుగుపై చర్చ జరుగుతున్న తరుణంలో వేయబోతున్న సాహస, ధైర్యవంతమైన అడుగు ఇలా ఉండబోతోంది..!’ అని బొండా ఆ ఫోటోలో పేర్కొన్నారు. ఉమా ఈ ట్వీట్‌తో పాటు ఆయన చేసిన బంగీ జంప్‌ దృశ్యాలను జోడించారు.దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మల్లాది విష్ణు ఉన్నారు. అందువల్ల బోండా ఉమ వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి ఈ మేరకు ఆఫర్ ఉందట. కానీ.. బోండా ఉమ మాత్రం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆ విషయం వద్దే కాస్త ప్రతిష్టంభన ఉందట. ఏదేమైనా బోండా ఉమ వైసీపీలో చేరడం మాత్రం పక్కాగా చెబుతున్నారు. చూడాలి త్వరలో ఏం జరగబోతోందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: