కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైంది.  ఈ  ఓటమికి కారణాలు ఏంటని ఒకసారి విశ్లేషణ చేస్తే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.  ముఖ్యంగా నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నది.  గతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నది.  ఆ క్యాడర్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించింది.  పార్టీలో బలమైన నేతలు ఎందరో ఉండేవారు.  బలమైన నేతలు యువ నాయకత్వాన్ని, యువ నాయకులను ప్రోత్సహించలేదు.  ఇలా చేయకపోవడం వలన పార్టీ వీక్ అయ్యింది.  


కార్యకర్తల విషయంలోనూ పార్టీ అలసత్వం ప్రదర్శించింది.  అంతర్గత కుమ్ములాటలు కారణంగా కార్యకర్తలు కాంగ్రెస్ పై నమ్మకాన్ని కోల్పోయారు.  తెలంగాణా వచ్చిన సమయంలో దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన నాయకులు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ పతనానికి మొదటి దెబ్బగా మారింది.   ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా మారింది అంటే కొత్తగా వచ్చిన పార్టీలు కూడా ఒకటి అరా సీట్లు గెలుచుకుంటున్నా.. కాంగ్రెస్ మాత్రం ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయింది.  130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ 175 స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోవడం విశేషం.  


తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా  ఇదే పరిస్థితి ఉంది.  దక్షిణాదిన కర్ణాటకలో ఫర్వాలేదని అనుకుంటే.. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి ధోరణి వలన అధికారం కోల్పోయింది.  బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది.  కేరళలో కూడా ప్రస్తుతం పార్టీ అధికారంలోలేదు .  నార్త్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్నది.  


అక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.  అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కి తేడా స్వల్పమే.  ఏదైనా తేడా వస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అధికారం  పరిస్థితి  రావొచ్చు.  కాంగ్రెస్ పార్టీకి  కంచుకోటగా ఉన్న అమేథీ నియోజక వర్గంలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఆ నియోజక వర్గాన్ని రాహుల్ సరిగా పట్టించుకోవడం లేదని చెప్పి అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారు.  2014 కు ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా బలంగా ఉన్నమాట వాస్తవం.


2014 లో ఆ పార్టీ ఒటమి పాలయ్యాక, అర్ధికంగా కుడా చితికిపోయింది.  కాంగ్రెస్ పార్టీ అస్తుల కరిగిపోవడం మొదలుపెట్టాయి.  కొన్ని చోట్ల పార్టీ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది.  పార్టీకి అప్పులు పెరిగిపోవడం ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది.  పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బడాబడా నేతల ఇళ్లపై ఐటి రైడ్స్ జరగడం పార్టీ ఒటమికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: