వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయ సాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ పై ట్విట్టర్ వేధికగా మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని తనయుడు నారా లోకేష్ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అని విమర్శలు చేస్తున్నారు. 


ఈ విమర్శలకు నెటిజన్లు కూడా సరైన సమాధానం ఇస్తున్నారు. 'కేవలం 2 నెలల పాలనాను విమర్శిస్తున్నారు, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు ఆంద్ర రాష్ట్రాన్నీ అష్టకష్టాలు పెట్టారు.'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు. అయితే ప్రతిపక్షం చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుంటాడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. 


ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత నారా లోకేష్ అన్న క్యాంటిన్లు మూత పడ్డాయి అని ట్విట్ల మీద ట్విట్లు చేశారు. ఈ ట్వీట్లకు విజయ సాయిరెడ్డి స్పందిస్తూ 'అన్న క్యాంటీన్లను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ? మూసేశారని టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు. మీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా దోచుకునేందుకే మొదలు పెట్టారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారు.' అంటూ ట్విట్ చేశారు విజయ సాయి రెడ్డి. మరి ఈ ట్విట్ కి నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: