ఒక పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఎవరి తల పగులుతుందో తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లాలో అదే జరిగింది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అటవీ అధికారులను అవాక్కయ్యేలా చేసింది. అతడ్ని నమ్ముకున్న కూలీలను బోల్తా కొట్టించింది. ఇతని పేరు ఆవుల నారాయణయాదవ్, రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుకు ఒక బైకు వేసుకొని వచ్చి నారాయణ, పని కోసం చూస్తున్న కూలీల దగ్గరకు వెళ్లాడు. 14 కిలోమీటర్ల రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటాలన్నాడు.





పాలకోడేరు నుంచి వేండ్ర వరకు ఉన్న రోడ్డును కూడా చూపించాడు. మగవాళ్లకైతే రోజుకి నాలుగు వందల యాభై, ఆడవాళ్లయితే మూడు వందల యాభై కూలీ అని చెప్పాడు. పదిహేను రోజుల పనికి డెబ్బై ఐదు మంది కావాలి అన్నాడు. అతని మాటలు నమ్మిన కూలీలు ఎగిరి గంతేశారు. నారాయణరావు చూపించిన రోడ్డుకి ఇరువైపులా గుంతలు కూడా తీసేశారు. మొదటి రోజు కూలి అడిగారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కావాలన్నాడు. రెండో రోజు నారాయణరావు చెప్పిన డాక్యుమెంట్ లు తెచ్చారు. అయితే అవి సరిపోవంటూ మరో కాగితం పేరు చెప్పాడు కానీ‌   డబ్బులు ఇవ్వలేదు.






మూడు రోజులు పని చేయించాక చేతులెత్తేశాడు. అదేంటని కూలీలు గట్టిగా బెదిరిస్తే రెండు చేతులతో దండం పెట్టేశాడు. 14 మందిని పని చేయటానికి  కావాలి అన్నాడు. తరువాత  తాను అటవీశాఖ అధికారిని అని వారితో చెప్పాడు,  ఇంకొకసారి ఎపిడిఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ అభివృద్ధి శాఖ సంస్థకు సంబంధించినవవాడిని అని అన్నాడు. నేను టెక్నికల్ ఆఫీసర్ ని రేపొద్దున పెద్ద ఆఫీసర్లు వస్తారు  అని చెప్పాడు. మీరు ఈ రోజుకి పనికి రావద్దు అన్నాడు. దిక్కులేని పరిస్తితులలో కూలీలంతా అటవీశాఖ, మండల  అధికారుల వద్దకు వెల్లారు, అధికారులు తాము మొక్కలు నాటే పని ఏదీ పెట్టుకోలేని నారాయణరావు ఒక మానసిక రోగి అని తేల్చి చెప్పారు. ఇలా మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని నమ్మి కూలీలు బోర్లా పడ్డారు, మూడు రోజులు    వర్షంలో వెళ్ళి మరీ పని చేసిన  కష్టాన్ని కోల్పోయామని బోరున విలపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: