ఒక వ్యక్తి  హిందూయేతరుడు అని తన డెలివరీ వాలెట్ మార్చమని జోమాటోను కోరగా 'ఫుడ్ హస్ నో రిలిజియన్' తో జోమాటో  సమాధానం ఇచ్చిన విషయం‌ మరువకముందే... 'హమ్ హిందూ' అనే ఒక మితవాద గ్రూప్ స్థాపకుడు లైవ్ టీవీలో ముస్లిం యాంకర్‌ను చూడకుండా ఉండటానికి తన కళ్ళు మూసుకున్నాడు. 2015 లో ప్రారంభమైన ఈ గ్రూప్ స్థాపకుడైన అజయ్ గౌతమ్ ఒక సొంత వెబ్‌సైట్‌ను కలిగి ఉన్నాడు.


జోమాటో సంఘటన గురించి చర్చించడానికి గౌతమ్ ని టెలివిజన్ న్యూస్ ఛానల్  news24 లో ఆహ్వానించారు, అతను యాంకర్ ఖలీద్ను చూసినప్పుడు  అతనిని చూడటానికి నిరాకరించాడు. అతన్ని చూడకుండా ఉండటానికి అతను  తన కళ్ళ మీద చేతులు పెట్టాడు.

ఈ సంఘటనను చూసి  news24  ఎడిటర్ ఇన్ చీఫ్ అనురాధ ప్రసాద్ తాము ఇటు వంటి వాటిని సహించలేము అని  ఇక పై  అజయ్ గౌతమ్ ను తమ స్టూడియోకు ఆహ్వానించడానికి నిరాకరిస్తున్నట్టు తెలిపారు. ఈ వార్త   ఇప్పుడు ట్విట్టర్ లో‌ ట్రెండింగ్ గా నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: