భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వడోదరా నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయ్. ఎటు చూసినా వరద విలయం తాండవిస్తోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చుట్టు పక్కల చెరువుల నుంచి ప్రమాదకర మొసళ్లు జన వాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. దీంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కుండ పోత వానతో జలమయమైన వడోదరలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సాయమందిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలతో వడోదరలోని ఒక జూ తొంభై శాతం మేర నీట మునిగింది. వారం రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి.వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వడోదర ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. అటు పలు రైళ్లను కూడా రద్దు చేశారు.మరికొన్నింటిని దారి మళ్లించారు. వరదలలో వాహనాలు సైతం పూర్తిగా నీట మునిగాయి. గుజరాత్ నగరంలోని నవసారీ వల్సాడ్ లాంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. వరద ఉధృతికి ముంపు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామాల్లో నీళ్లు సగానికి పైగా నీట మునిగాయి. వరదల తాజా పరిస్థితిపై సీఎం విజయ్ రూపానీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.




కర్ణాటక లోనూ  ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అనేక ప్రాంతాల్లో నడుము లోతు వరకు నీరు పోటెత్తడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు వరద నీరు బెంగళూరు నగరాన్ని కూడా చుట్టుముట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు నిత్యావసర వస్తువులను తెచ్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: