సామాజిక ఫించన్లకు నిధుల కొరత వెంటాడుతోంది. ఓ వైపు లబ్దిదారులను మరోవైపు అధికారులను టెన్షన్ కు గురి చేస్తోంది. ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఫించన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించి నిధులను ఒకటి రెండు రోజుల ముందే మండల స్థాయి అధికారులకు విడుదల చేస్తోంది. కానీ ఈ నెల మాత్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాలేదు, దీంతో పెన్సన్ల పంపిణీ పై అధికారుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి జిల్లాలోని ప్రతి మండలానికి అరవై శాతం మేర నిధులు మాత్రమే విడుదల అయ్యాయి.


గురు, శుక్రవారాల్లో కొన్ని గ్రామాల్లో ఫించన్ల పంపిణీని సాగింది. గ్రామాల్లో నిధులు లేక ఈ ప్రక్రియ నిలిచిపోయింది అరా కొరా నగదును పెన్షన్ దారులకు సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ ముంఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేశారు.

"ముఖ్యమంత్రి గారు, ప్రతీనెలా 1వ తేదీనే అందుకునే పింఛను గత నెల వారం దాటాక ఇచ్చి, ఈ నెల సగమే ఇచ్చి అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. పింఛను వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి  250 పెంచారు. ఈ 250లో మీ వైకాపా నాయకులు పెట్టిన హుండీలో 50 వేయాలి. మిగిలిన సొమ్ము చిరిగిపోయిన నోట్లిచ్చి ముసలోళ్ల నోరు కొడుతున్నారు. నా పింఛను మొత్తం ఇవ్వలేదని అవ్వ అడుగుతోంది. చినిగిపోయిన నోట్లిచ్చి మోసంచేశారని తాత నిలదీస్తున్నాడు. పింఛనులో సగమే ఇచ్చారయ్యా అంటోంది ఓ వితంతువు. వైకాపా నేత నా దగ్గర రూ.50 తీసుకుంటున్నాడని వాపోతున్నాడు దివ్యాంగుడు." అని నారా లోకేష్  ముంఖ్యమంత్రి పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: