ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్ స్టార్ నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు. అన్న క్యాంటీన్లను మూతపడ్డాయని, అందుకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారాని, ఆయన వ్యాఖ్యానించారు. 


నారా లోకేష్ ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ 'ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను మూసివేయడం వల్ల నిరుపేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇందులో పనిచేసే వారు కూడా ఇప్పుడు ఉపాధిని కోల్పోయారు. ఎన్నికల ముందు నేను విన్నాను.. నేను ఉన్నాను అన్న వైఎస్ జగన్ గారు విన్నది, చూసింది ఇదేనా అని పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు.' అంటూ వీడియోని జత చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 


ఆ వీడియోలో ఓ బామ్మా సీఎం జగన్ ని తిడుతూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా అంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'లోకేష్ బాబు మీరే కదా జులై వరుకు కాంట్రాక్ట్ రాశారు, ఇప్పుడు మీరే విమర్శిస్తారు ఏంటి.. ఆగండి ఇది కొత్త ప్రభుత్వం.. కొంచం ఆగుతే జగనన్న అందరి లెక్కలు సరి చేస్తారు' అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మరి కొందరు ట్విట్ చేస్తూ 'రెండు నెలల పాలనాకే ఇన్ని విమర్శలు చేస్తే మీరు గత 5 ఏళ్ళల్లో ఎన్ని అరాచకాలు చేశారు' అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే నారా లోకేష్ నిన్న, మొన్న కూడా అన్న క్యాంటీన్లపై ఇలానే ట్విట్ చేస్తే విజయసాయి రెడ్డి ఉదయం కౌంటర్ కూడా ఇచ్చారు, కానీ లోకేష్ ట్విట్లు మాత్రం ఆపడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: