ఎన్నికల్లో పార్టీ  ఘనవిజయం సాదించి అధికారంలోకి వచ్చిన తరువాత తమకు మంచి ప్ర్రధాన్యత ఉంతుంది అనుకున్న వైకాపా నేతలకు భారీ షాక్ తగిలింది. ముందు నుంచి ఉన్న వారి కన్నా  వలస నేతలకు పార్టీలో  ఎక్కువ ప్రియారిటీదక్కింది. వారికే పదవులు దక్కాయి దీంతో ఇప్పుడా నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. హైకమాండ్ ముందు తమ బాధ వినిపించేందుకు రెడీ అవుతున్నారు. విశాఖ వైసీపీలో అసంతృప్తి సెగలు రేగాయి. ఈ సెగలు రోజురోజుకు పెరుగుతున్నాయి పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు పదవులు రావడం లేదని కొందరు నేతలు మదనపడుతున్నారు.




అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి రాగానే మంత్రయ్యారు, ఎన్నికలకు వారం రోజుల ముందు పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖ మెట్రో రీజినల్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ద్రోణంరాజుకు పదవి ఇవ్వడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న నేతలకీ పడటం లేదు. కాంగ్రెస్ లో తనతో పాటు వచ్చిననేతలకే ద్రోణంరాజు ప్రాధాన్యత ఇస్తున్నారనేది క్యాడర్ విమర్శ తమను పట్టించుకోవడం లేదని ఎన్నికల టైంలో కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించటంలో ఓడిపోయారనేది కార్యకర్తల వాదన.




అన్ని వర్గాలనూ కలుపుకోకపోవడం వల్లే ఓడిపోయారని ఆయన వైఖరి. ఇలాగే ఉంటే దక్షిణంలోనే కాదు విశాఖ కార్పొరేషన్ ఎన్నికల నాటికి పార్టీ మునగడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు అవంతి శ్రీనివాస్ తో కూడా వైసీపీ నేతలుకు గ్యాప్ ఉందిని అందరు నేతలను కలుపుకొని పోవడం లేదని కొందరు నేతలు చెప్తున్నారు. మరోవైపు విశాఖ వైసిపిలో చాలా మంది సీనియర్ నేతలు ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ ఇలాంటి వారు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్ నాథ్ ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి నడిపించారని ఇలాంటి నేతలకు పదవులు ఇవ్వకుండా ఎన్నికల ముందువచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఏంటి అని వైసీపీ క్యాడర్ ప్రశ్న.ఇటీవలే ఎన్నికల్లో ఓడిపోయిన కె  కె రాజు మళ్ల విజయ ప్రసాద్ లాంటి నేతలు కూడా నామినేటెడ్ పదవులపై ఆశలుపెట్టుకున్నారు.





రాబోయే జీ వీ ఎం సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల్లో అసంతృప్తి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖ వెస్ట్ ఈస్ట్ నార్త్ సౌత్ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. నగరంలో టిడిపికి మంచి పట్టుంది, రాబోయే జీ వీ ఎం సీ ఎన్నికల పార్టీలో అసంతృప్తిని చల్లార్చి పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు పార్టీపెద్దల జోక్యం చేసుకొని విశాఖ వైపు దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: