మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.  ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకా వర్గాల నుంచి పోటీ చేసి కేవలం 18 సీట్లు గెలుచుకున్నారు.  మెగాస్టార్ చిరంజీవి ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి విజయం సాధించారు.  మెగాస్టార్ గెలిచిన 18 సీట్లు తరువాత ఎంత కీలకంగా మారిందో తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు.  


ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత మెగాస్టార్ కు కేంద్రంలో పదవిని పొందారు.  2014 తరువాత మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.  ఎప్పుడైతే మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడో.. అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం మొదలు పెట్టారు.  2014 లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి.. టిడిపి.. బీజేపీలకు సపోర్ట్ చేశారు.  ఈ సపోర్ట్ కొంతమేరకు అప్పట్లో పనికొచ్చింది.  


అయితే, అప్పట్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని విభేదాలు రావడంతో తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు.  2019 లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసింది.  ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది.  ఖాతా అయితే తెరిచింది జనసేన.  వచ్చే ఎన్నికల నాటికి బలంగా మారాలని చూస్తోంది. దానికోసం ఇప్పటి నుంచే పార్టీ కార్యాచరణను మొదలుపెట్టింది.  


అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ లను తమ పార్టీలోకి తీసుకోవాలని ట్రై చేస్తున్నది.  కారణాలు చాలా ఉన్నాయి.  ఈ ఇద్దరు టాప్ స్టార్లు బీజేపీలో ఉంటె ఆ పార్టీకి మంచి పలుకుబడి వస్తుంది.  ఇద్దరికీ మాస్ లో ఇమేజ్ ఉన్నది.  పార్టీని విజయం దిశగా నడిపించేందుకు అది దోహదం చేస్తుంది.  అందుకే ఎలాగైనా మెగాస్టార్, పవర్ స్టార్ లను బీజేపీలోకి తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ.  జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే... పవన్ కళ్యాణ్ కు రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ భావిస్తోంది.  మరి దీనికి మెగాబ్రదర్స్ ఒప్పుకుంటారా ? చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: