నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పగ్గాలు కాకినాడకు చెందిన కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజుకి అప్పగిస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నియామక పత్రాలు కూడా అన్ని జిల్లాలకు జారీ చేసినట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయా రాష్ట్ర అధ్యక్షులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పగ్గాలను పళ్లంరాజుకి అప్పగించింది. 


ఇప్పటి వరకూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టారు. కష్టకాలంలో కూడా ఆయన పార్టీ వెన్నుతట్టి ముందుకు నడిపించినట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకు కారణం లేకపోలేదు. హైదరాబాద్‌ రాజదానిగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ రెండు ముక్కలుగా విభజించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది.


2013లో జరిగిన రాజకీయ మార్పులలో భాగంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన నిలుస్తారని, అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భావించారు. ఆ కోణంలోనే తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి రాష్ట్ర విభజన చేపట్టారు. రాష్ట్ర విభజన పట్ల ఎన్ని అభ్యర్థనలు, అంతరాయాలు ఎదురైనా సోనియాగాంధీ వైఖరి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మారింది. అంతిమంగా రాష్ట్ర విభజనకు గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆవిర్భావమైంది. బంగారు తెలంగాణను చేస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రెడ్డి చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నట్టేనని నిర్భాహకులు చెబుతున్నారు. 


ఈ పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ కరువైంది. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ఎక్కడికక్కడ రాష్ట్ర పగ్గాలు మారుస్తూ వస్తోంది. కాగా రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎంతవరకూ పార్టీని ముందుకు నడిపిస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: