టిక్ టాక్ ఇపుడు ఎక్కడ చూసిన ఇదే  గేమ్. ఇది ఒక ఆట కాదు, వ్యసనంగా మారిపోయింది. చదువుకున్న వారు. లేని వారు అంతా కలసి ఈ గేమ్ కి బలైపోతున్నారు. ఇంట్లో వాళ్లను పట్టించుకోరు. ఎవరితోనూ కలసి ఉండరు, ఎంతసేపు ఈ   గేమ్ షో కోసమే బతుకంతా అర్పించేస్తున్నారు. ఇది ఎలా తయారైందంటే విధులు నిర్వహించాల్సిన ఆఫీసుల్లోనూ పాకిపోయింది. దండించాల్సిన ఖాకీలు సైతం టిక్ టాక్ కు సరెండర్ అయిపోతున్నారు. 


ఖాకీలు విధులలో టిక్ టాక్  గేమ్  ఆడితే పనిష్ చేస్తామని ఏపీ డీజీపీ హెచ్చరించాల్సిన పరిస్థితి. ఇక టీచర్లు, ఇతర సెక్షన్లలోనూ ఇదే హడావుడి ఉంది. సాహసాలు అంటారు. చాలేంజ్ అంటారు. ఒకటేమిటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాపురాల్లో చిచ్చు పెట్టేలా టిక్ టాక్ తయారైందని అంతా ఆవేదన చెందుతున్నారు. 


చెన్నైకి చెందిన ఓ హౌస్ వైఫ్ తన భర్త టిక్ టాక్  గేమ్ ఆడవద్దన్నాడని ఏకంగా అడే టిక్ టాక్ వీడియో షూట్ చేస్తూ  విషం తాగి మరీ  సూయిసెడ్ చేసుకుంది. ఇలాంటి దారుణాలు, బలవన్మరణాలు ఎన్నో, యువకులు స్కూటర్ల మీద విచిత్ర విన్యాసాలు చేస్తూ టిక్ టాక్ చాలెంజ్ చేస్తున్నారు. అంత కంటే కూడా భయంకరమైన ఫీట్లు చేస్తూ బతుకు బండలు చేసుకుంటున్నారు.


దీంతో ఇపుడు రాష్ట్ర ప్రభుత్వాలు టిక్ టాక్  గేమ్ ని నిషేధించాలని కేంద్రన్ని గట్టిగా కోరుతున్నాయి. లేటెస్ట్ గా తెలంగాణాలో కేసీయార్ సర్కార్ టిక్ టాక్ ని నిషేధించమని లేఖ రాసింది. ఇంతకు ముందే తమిళనాడు,మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కూడా టిక్ టాక్ నిషేధం కోరాయి.  దీంతో కేంద్ర హోం శాఖ కూడా కదలివచ్చింది. టిక్ టాక్ షో నిర్వాహకులకు దీని మీద సంజాయిషీ కోరుతూ లెటర్ రాసింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో టిక్ టాక్ బాధితులు ఉన్నందువల్ల ఈ  గేమ్  షోని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: