బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. ఒక రోజు ప్రత్యేక హోదా రాదు, ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డ్రామా అని అంటే మరొకరోజు వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకోవాలి అని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.                         


ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ ''ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామకవేత్తలు భయపడుతున్నారని, పోలవరం నిర్మాణం పాత ధరలకే నవయుగ కంపెనీకి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అప్పగిస్తే దానిని కూడా రద్దు చేయడం విడ్డూరం అని, విద్యుత్‌ ఒప్పందాలనూ ఏకపక్షంగా రద్దు చేశారని, ఒక ప్రభుత్వం ఇచ్చిన వాటిని సహేతుకమైన కారణాలు చెప్పకుండా రద్దు చేస్తూ పోతే ఇక రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారు?’’ అంటూ ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి.                                                             


ఆంధ్రాకి ప్రత్యేక హోదాపై మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారని ఆమె గుర్తు చేశారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు మభ్య పెట్టినట్లే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలను మభ్య పెడుతున్నారని పురందేశ్వరి ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలకు వైసీపీ నాయకులూ ఎలా స్పందిస్తారో చూడాలి.                                                                                                                                                                                   



మరింత సమాచారం తెలుసుకోండి: