పోలవరం ప్రాజెక్ట్‌పై రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యానారాయణ చౌదరి (సుజనా చౌదరి) చిలక పలుకులు పలుకుతున్నతీరు అవినీతికి అండగా నిలుస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీలో ఓ కీలక నాయకుడిగా రాష్ట్ర రాజకీయాలను సుజనా చౌదరి ప్రభావితం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.  


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే సుజనా చౌదరి కొంతకాలం ప్రజా సంభంధాలకు దూరంగా ఉన్నట్టు దుమారంలేచింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరిపోయారు. మరో 15 మంది శాసన సభ్యులు కూడా రంగం సిద్దం చేసుకున్నారు. కాగా బీజేపీలోనికి వెళ్తే మరింత ప్రజాదరణ కోల్పోవాల్సి వస్తుందని భావించిన ఆ 15 మంది వెనుకడుగువేశారు. వారందరికీ మార్గనిర్ధేశకుడిగా ఉన్న సుజనా చౌదరి బీజేపీ తరపున మద్యవర్తిత్వం వహించినా ప్రయోజనం లేకపోయింది.


 సుజనా చౌదరి రాష్ట్రంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అనేక అవినీతి వ్యవహారాల నుంచి తనను తాను కాపాడుకోవటం కోసం బీజేపీ అండ తీసుకున్నారనే విమర్శలున్నాయి. అటువంటి సుజనా చౌదరి పోలవరం ప్రాజెక్ట్‌ రివర్స్‌ టెండరింగ్‌పై మాట్లాడుతూ కేంద్రంతో సంప్రదించి అనతరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించడం విమర్శలకు తావిస్తోంది. 


రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ఏకపక్షంగా చేసిందని ఆరోపించడం, గత ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల తప్పులను సరిచేసి పనులు కొనసాగించిందిని హితవు పలకడం పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయులు తప్పుపడుతున్నారు. సుమారు రూ.2000 కోట్ల అవినీతి జరిగిన ఈ వ్యవహారాన్ని సుజనా సమర్ధించడం ఆయన అవినీతికి ఏ స్థాయిలో అండగా ఉన్నారనే దానికి నిదర్శనమని దుయ్యబడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: