నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని సంపాదించారు. భారతదేశ ప్రధాని  నరేంద్ర మోడీ ఇప్పటివరకు చూసిన  ప్రధాన మంత్రుల్లో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాలి.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా కు ప్రధాని ఎలా ఉండాలో  నిరూపిస్తున్నాడు. ప్రపంచ దేశాలు కూడా తమ దేశాలకు మోడీ వస్తున్నాడంటే చాలు.  ఎక్కడలేని గౌరవమర్యాదలతో, సగర్వంగా ఆహ్వానిస్తారు. ఇదే విషయంలో పొరుగున ఉన్న పాకిస్తాన్  అధిపతి వేరే దేశాలకెలితే మోడీకి ఇచ్చిన మర్యాద పాకిస్తాన్ అధిపతి ఇమ్రాన్ ఖాన్ కు దక్కకపోవటం మనం చూస్తూనే ఉన్నాము.


ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూసేటట్లు మోడీ చేశారు అంటే అతిశయోక్తి కాదు. విదేశాంగ విధానంలో తనదైన వ్యూహాన్ని రచిస్తూ ఇండియాను తిరుగు లేని శక్తిగా నిలబెడుతున్నారు. 2014 లో అఖండ మెజారిటీని సాధించిన మోడీ మళ్ళీ 2019 లో తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యి తన సత్తా ఏంటో చూపించారు. అయితే తిరిగి ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించడంతో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకడుగు వేయటం లేదు. 


అయితే ఇప్పుడు కాశ్మీర్ లో భద్రత బలగాలను ఎక్కువగా మోహరించడం చూస్తుంటే పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్ ను తిరిగి చేజిక్కించుకోవాలని మోడీ వ్యూహ రచన చేసినట్లు తెలుస్తుంది. కాశ్మీర్ లో మూడో వంతు భూభాగాన్ని 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ ఒంటరి అయిపోవటమంతో .. ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగటంతో ఇదే మంచి తరుణమని మోడీ భావిస్తున్నారు. ఇదే గాని జరిగితే పాకిస్థాన్  భారత్ మధ్య పెద్ద యుద్ధం తప్పదని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని కొంత మంది మోడీ వ్యాఖ్యలతో ముడి పెడుతున్నారు. భారత్ .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను చేజిక్కించుకోవలనే ముందుగానే అమెరికాకు చెప్పిందని .. అందుకే ట్రంప్ నేను మద్య వర్తితత్వం చేస్తానని చెప్పాడని  కొంత మంది ఊహాగానాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: